కల్యాణ్ కన్ఫ్యూజన్..ఎందుకు ఇలా?

-

ఎందుకో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కొన్ని సార్లు ఆయన మాటలు చూస్తుంటే…టి‌డి‌పితో కలిసి ముందుకెళుతున్నారని అనిపిస్తుంది. కొన్ని సార్లు చూస్తే బి‌జే‌పితో కలిసి ముందుకెళ్తారని అనిపిస్తుంది. అసలు టోటల్ గా పొత్తులపై క్లారిటీ లేకుండా పోయింది. అధికారికంగా చూస్తే జనసేన-బి‌జే‌పి పొత్తులో ఉన్నాయి. కానీ పేరుకే పొత్తులో ఉన్నారు గాని ఎప్పుడు కలిసి పనిచేయలేదు.

అయితే ఇటీవల కాలంలో రెండు సార్లు చంద్రబాబు-పవన్ కలిశారు..పైగా వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని పదే పదే చెబుతున్నారు. ఈ సారి ఒంటరిగా వెళ్ళు వీరమరణం పొందడం కంటే వ్యూహం ప్రకారం ముందుకెళ్లడం బెటర్ అని పొత్తుపై క్లారిటీ ఇచ్చినట్లు చెప్పారు. దీంతో టి‌డి‌పి-జనసేన పొత్తు ఖాయమని ప్రచారం మొదలైంది..అలాగే సీట్ల పంపకాలపై కథనాలు కూడా వస్తున్నాయి. ఇక వీరితో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది తర్వాత అంశామని చర్చలు నడిచాయి.

 

ఒకవేళ బి‌జే‌పి కలిస్తే ఓకే.. లేదంటే టి‌డి‌పి-జనసేన కలిసి ముందుకెళ్లడం ఖాయమని ప్రచారం వచ్చింది. ఇలా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా..బి‌జే‌పితో తమ పొత్తు ఉందని, వారితో కలిసే ఎన్నికలకు వెళ్తామని, కాదంటే ఒంటరిగా వెళ్తామని, కొత్త పొత్తులు కలిస్తే ముందుకెళ్తామని టోటల్ గా కన్ఫ్యూజ్ చేశారు. అటు బి‌జే‌పి వాళ్ళు ఏమో జనసేనతోనే పొత్తు అని, టి‌డి‌పితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అంటున్నారు.

అంటే ఎన్నికల్లో జనసేన-బి‌జే‌పి కలిసి ముందుకెళ్లాలి. కానీ టి‌డి‌పితో కలిస్తేనే అధికారంలోకి రాగలమనే విషయం పవన్‌కు తెలుసు. అటు టీడీపీకైనా..జనసేన కలిస్తేనే గెలుపు దగ్గరవుతుందనే విషయం తెలిసిందే. అయితే జనసేనతో పొత్తుకు టీడీపీ రెడీ..కానీ బి‌జే‌పిని ఒప్పించి పవన్ టి‌డి‌పితో కలవాలి. ఒకవేళ బి‌జే‌పి ఒప్పుకుంటే పర్లేదు..లేకపోతే పవన్..టి‌డి‌పిని పక్కన పెడతారా? లేక బి‌జే‌పిని పక్కన పెట్టి టి‌డి‌పితో కలుస్తారనేది క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version