పవన్ విషయాలు రివీల్ చేస్తూ..ఆయనంటే ఇష్టం అంటున్న బాలయ్య కూతురు..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకే కాదు సెలబ్రిటీలకు.. సెలబ్రిటీ డాటర్స్ కి కూడా ఆయనంటే ఇష్టం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బాలయ్య కూతురికి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమట. అంతేకాదు ఆయన గురించి ఎన్నో షాకింగ్ విషయాలను రివిల్ చేస్తూ తనపై ఉన్న ఇష్టాన్ని ప్రకటించింది అనే వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.. హీరో బాలకృష్ణ క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే తన ఇద్దరు కూతుర్లను అలాగే కొడుకును కూడా అంతే క్రమశిక్షణతో పెంచారు బాలయ్య. అందుకే చాలావరకు వారు మీడియాకు దూరంగా ఉంటారు. అయితే బాలయ్య చిన్న కూతురు తేజస్వినీకి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అని సమాచారం.

అన్ స్టాపబుల్ షో సీజన్ 2 కి తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. అయితే గతంలో ప్రోమోలలో అన్ స్టాపబుల్ స్టేజ్ పై ఎప్పుడూ కనిపించని తేజస్విని.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సమయంలో కనిపించడంతో పవన్ కు తేజస్విని వీరాభిమాని అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం గురించి ఇంకా అధికారికంగా స్పష్టత వస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త మాత్రం అటు పవన్ అభిమానులకు ఇటు బాలకృష్ణ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఎపిసోడ్ చివరి ఎపిసోడ్ గా ప్రసారం కానుండగా ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ షో లో ప్రతి ఎపిసోడ్ కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ బాలయ్యను అలాగే ఓటీటీ ఆహా సంస్థను కూడా ఉన్నత స్థానానికి తీసుకెళ్తోంది.మొత్తానికి ఈ షో ద్వారా బాలయ్య కూడా మరో ఫీట్ అందుకున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version