ఏపీ రాజకీయాల్లో అనేక హాట్ టాపిక్స్ ఉన్నాయని చెప్పొచ్చు…ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఇప్పటినుంచే నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం అతి పెద్ద హాట్ టాపిక్ గా ఉంది…ఇక ఇదేగాక పొత్తుల అంశం కూడా చర్చలో ఉంది…నెక్స్ట్ టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది కూడా హాట్ టాపిక్ గానే ఉంది…అలాగే ఇంకొన్ని హాట్ టాపిక్స్ ఉన్నాయి…వాటిల్లో ప్రధానంగా ఉన్నది పవన్ కల్యాణ్ నెక్స్ట్ ఎక్కడ పోటీ చేస్తారు? అనేది కూడా ప్రజల్లో చర్చగా నడుస్తోంది.
గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే…గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసి పవన్ ఓటమి పాలయ్యారు. అసలు పవన్ ఓటమిని ఎవరూ ఊహించలేదు…కానీ జగన్ గాలిలో పవన్ ఓడిపోయారు. ఇక పవన్ ఓటమిపై వైసీపీ నేతలు ఏ స్థాయిలో సెటైర్లు వేస్తూ వచ్చారో అందరికీ తెలిసిందే..ఇప్పటికీ ఈ అంశంపై కామెంట్లు చేస్తూనే ఉంటారు…నెక్స్ట్ కూడా పవన్ గెలవరని ఎద్దేవా చేస్తూ ఉంటారు.
కానీ నెక్స్ట్ పవన్ గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తారని జనసేన శ్రేణులు కాన్ఫిడెంట్ గా చెబుతున్నాయి. సరే కాసేపు పవన్..గెలుస్తారా? ఓడిపోతారా? అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే…అసలు నెక్స్ట్ పవన్ ఎక్కడ పోటీ చేస్తారు? ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది తెలియాల్సిన విషయం. నెక్స్ట్ ఎన్నికల మాదిరిగానే పవన్…గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేస్తారా? లేక ఆ రెండిటిల్లో ఒకచోటే పోటీ చేస్తారా? లేకపోతే ఈ రెండు కాకుండా వేరే చోట పోటీ చేస్తారా? అనేది తెలియడం లేదు.
ప్రస్తుతం నడుస్తున్న చర్చలు ప్రకారం…పవన్ ఈ సారి గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేయరని తెలుస్తోంది…అలాగే ఆయన ఈ సారి ఒకచోటే పోటీ చేస్తారని తెలుస్తోంది. జనసేన శ్రేణులు కూడా అదే కన్ఫార్మ్ చేస్తున్నాయి…ఈ సారి పవన్ ఒక చోటే పోటీ చేస్తారని, అయితే పవన్ పోటీ చేసే సీటు ఎన్నికల ముందే క్లారిటీ వస్తుందని అంటున్నారు.