వచ్చే ఎన్నికల్లో జగన్ వెర్సస్ పవన్ అని తేలిపోయింది.సినిమాల పరంగా తనను పూర్తిగా అడ్డుకుంటూ తన మూలాలను దెబ్బ కొట్టే విధంగా జగన్ చేస్తున్న పనులను నిరసించడంలో పవన్ ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగా విజయం సాధించారు కూడా! రెండు సినిమా మీటింగులను కూడా తనకు అనుగుణంగా మార్చుకుని జగన్ పై యుద్ధం చేశారు. రిపబ్లిక్ ఫంక్షన్లోనూ, వకీల్ సాబ్ ఫంక్షన్లోనూ తన వాదం ఏంటో చెప్పారు.
అదేవిధంగా భీమ్లా నాయక్ విడుదలకు ముందే మత్స్యకార సభ ఒకటి నిర్వహించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తనను ఎలా అడ్డుకున్నా పడినా లేచి వస్తాను అని చెబుతున్న పవన్ తన మాట తో చేతతో మరింత వేగంగా దూసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో భాగంగానే ఆయన ఇతర పార్టీల నాయకులను సైతం తన గూటికి చేర్చుకుని జగన్ కు గట్టి ఝలక్ ఇవ్వాలని పరితపిస్తున్నారు.ఇదే కనుక జరిగితే కీలక నేతల చేరికలే స్పష్టం అయితే జగన్ కు ఈ సారి మంచి ఫలితాలు రావడం ఖాయం.
ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ ఆగేలా లేడు పవన్.ఎలా అయినా ఈ సారి మంచి స్థాయిలో బల నిరూపణ చేసి ఆశించిన సీట్లు దక్కించుకుని వైసీపీకి ఝలక్ ఇవ్వాలని అనుకుంటున్నారు.శత్రువు ఎవరో తెలిసి పోయాక యుద్ధం చేయడం అన్నది సులువు. ఆ విధంగా పవన్ ఈ సారి శత్రువు స్పష్టంగా ఎవరు అన్నది తేల్చేశారు.దీంతో రానున్న ఎన్నికల్లో జగన్ కు గట్టిగా పోటీ ఇచ్చేందుకు శ్రమిస్తున్నారు పవన్. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతలను తన పార్టీలోకి ఆహ్వానించే చర్యల్లో భాగంగా టీడీపీ కి చెందిన మంగళగిరి పట్టణ మాజీ అధ్యక్షుడ్ని ఇవాళ పార్టీలో చేర్చుకున్నారు. ఇక్కడి నుంచి మొదలయ్యే చేరికలు రానున్న కాలంలో మరింత ఎక్కువ కానున్నాయి అని తెలుస్తోంది.