పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మెగాస్టార్.. ఫాన్స్ సంగతేంటి..?

-

కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చి మెగా ఫ్యామిలీగా తన కుటుంబాన్ని తీర్చిదిద్దిన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తర్వాత అంతే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీరిద్దరికీ సినిమాలలోనే కాదు అటు జనాలలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మెగాస్టార్ కనిపించబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై అభిమానులు ఒప్పుకుంటారా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.

అసలు విషయంలోకి వెళితే.. వరుసగా రెండు డిజాస్టర్ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసి సుమారుగా రూ. 140 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి నుండి ఈ రేంజ్ కం బ్యాక్ వస్తుందని అభిమానులు కూడా ఊహించలేదు. అలాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమా భోళాశంకర్.. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ చిత్రం వేదాలంకి రీమేక్గా తెరకెక్కబోతోంది.

మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా పర్వాలేదు అనిపించుకునే అంత రేంజ్ లో రెస్పాన్స్ లభించింది . అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.. ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని లాగా కనిపించబోతున్నారని సమాచారం.. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ చిత్రమైన ఖుషిలోని పాపులర్ నడుము సన్నివేశాన్ని ఈ చిత్రంలో రీ క్రియేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మెగాస్టార్ స్థాయి వ్యక్తి ఇలాంటివి చేస్తే అభిమానులు తట్టుకోగలరా? అనే కామెంట్లు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version