జ‌గ‌న్‌కు ‘గుంతలు’ చూపిస్తున్న పవన్!

-

ఎక్కడైనా పోటీ రంగంలో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తారనే డైలాగులు ఎక్కువ వాడుతారు. రాజకీయాల్లో కూడా తమ ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తామని నేతలు అంటుంటారు. మరి అదేంటో గాని పవన్ కల్యాణ్ మాత్రం తమ ప్రత్యర్ధిగా ఉన్న జగన్ కు మాత్రం ప్రతిరోజూ గుంతలు చూపిస్తున్నారు. పవన్ కల్యాణ్..వైసీపీ ప్రభుత్వంపై ఏదొక సమస్య గురించి పోరాడుతూనే ఉంటున్న విషయం తెలిసిందే. సమస్యలపై ఎప్పటికప్పుడు గళం విప్పే పవన్..ఈ మధ్య జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.

ఇదే క్రమంలో సోషల్ మీడియాలో కూడా పవన్…జగన్ ని వదలడం లేదు…రోడ్లపై పడిన గుంతలని పోస్టు చేస్తూ మరీ జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు…జనసేన #GoodMorningCMSir అనే హ్యాష్ ట్యాగ్ తో రాష్ట్రంలో ఉన్న గుంతలు పడ్డ రోడ్లని పోస్టు చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది జులై 15 నాటికి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసి, ప్రతిపక్షాల నోరు మూయించాలని జగన్…అధికారులని గతేడాదే ఆదేశించారు.

కానీ జులై 15 వచ్చింది గాని రోడ్లపై గుంతలు పెరిగాయి తప్ప తగ్గలేదని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇక పవన్ అయితే రోజుకో రకంగా రోడ్లపై గుంతలు పడిన వీడియోలని పోస్టు చేసి జగన్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే గుడ్ మార్నింగ్ సీఎం సార్…మా రోడ్లని కాస్త పట్టించుకోరూ అంటూ.. హెలికాప్టర్ ఎక్కుతున్న జగన్ కు విన్నవించుకునే కార్టూన్ ని పోస్ట్ చేశారు. తాజాగా ఒక కారు గుంతల్లో ఎలా ఊగుతూ వెళుతుందో..దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు.

ఈ విధంగా సోషల్ మీడియాలో జనసేన శ్రేణులు రాష్ట్రంలో గుంతలు పడిన ఫోటోలని , వీడియోలని షేర్ చేస్తూ…గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. మరి దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుంది…ఏ విధంగా కౌంటర్లు ఇస్తుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news