అస్వస్థతకు గురైన పవన్‌.. కార్యక్రమం మధ్యలోనే

-

వారాహి విజయ యాత్ర పేరిట జనసేన పార్టీ చీఫ్ పవన్‌ కల్యాణ్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన నాల్గవ విడుత వారాహి యాత్రను కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరిస్తున్న సమయంలో తీవ్ర వెన్ను నొప్పికి గురయ్యారు. కాసేపు రిలాక్స్ అయినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో ఆయన జనవాణి కార్యక్రమాన్ని ఆపేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

‘గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన వెన్నుపూసకు గాయమయింది. తాను తరచుగా వెన్ను నొప్పికి గురవుతున్నానని 2019లో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల వెన్ను నొప్పి పెరిగిందని ఆ ప్రకటనలో ఆయన వెల్లడించారు. పవన్ వెన్ను నొప్పికి గురికావడంతో అభిమానులు, జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.

అయితే..  జగన్ అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారని విమర్శించారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో నోటికి ఏదొస్తే అది హామీగా ఇచ్చేశారని దుయ్యబట్టారు. అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పవన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version