ఎన్నికల యుద్ధానికి పవన్ సిద్ధమయ్యారు. తన వారాహి వాహనంతో ఎన్నికల రంగంలోకి దిగనున్నారు. ఇంతకాలం అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తూ వచ్చిన పవన్..ఇకపై పూర్తిగా రాజకీయ యుద్ధ బరిలో దిగుతున్నారు. అయితే..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి వివాదంలో చిక్కుకుంది.
రాజకీయ ప్రచార వాహనానికి ఆలివ్ గ్రీన్ కలర్ ఉన్న వాహనం వాడకంపై వివాదం నెలకొంది. నిబంధనల ప్రకారం రక్షణ రంగ వాహనాలకు తప్ప ఇతర ప్రైవేట్ వాహనాలకు ఈ రంగు వాడటంపై నిషేధం విధించింది సర్కార్. దీంతో ఆ వాహనం రంగు మార్చడం తప్పదా ? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. లేక పోతే ఆ వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఛాన్స్ లేకపోలేదు. మరీ దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.