మంత్రులపై దాడులు చేస్తుంటే… పోలీసులు చేతులు కట్టుకుని కూర్చోరు : పేర్ని నాని

-

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి పేర్ని నాని. విశాఖ పర్యటనలో భాగంగా తనను అడ్డుకున్న తీరును ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన ఈజ్ వెయిటింగ్ అంటూ అధికార వైసీపీ హెచ్చరికలు జారీ చేశారు. ఆ మరుక్షణమే జనసేనకు వైసీపీ నుంచి అంతే స్థాయిలో వార్నింగ్ వచ్చింది. టీడీపీ, బీజేపీ,కమ్మూనిస్టులతో కలిసి రండి… వైసీపీ ఈజ్ వెయిటింగ్ అంటూ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని బదులిచ్చారు. మంత్రులపై దాడులు చేస్తుంటే… పోలీసులు చేతులు కట్టుకుని కూర్చోరని కూడా ఆయన అన్నారు. పోలీసులు వారి విధులను వారు నిర్వహిస్తారని నాని తేల్చి చెప్పారు.

Perni Nani: అమ్మఒడి పథకానికి ఈ అర్హ‌త‌లు తప్పనిసరి.. | Sakshi Education

తనపై ఎవరైనా విమర్శలు చేస్తే సహించలేని పవన్ కల్యాణ్.. తాను మాత్రం ఇతరులపై ఏ మాటలైనా మాట్లాడవచ్చా?అని ప్రశ్నించారు పేర్ని నాని. తనపై వ్యతిరేక కథనాలు రాశారని పలు పత్రికలు, టీవీ ఛానెళ్లను నిషేధిస్తున్నానని చెప్పిన పవన్… ఇప్పుడు అవే పత్రికలు, టీవీ ఛానెళ్లు తనకు అండగా నిలవాలని ఎలా కోరతారని నిలదీశారు. తాను విధానపరమైన విమర్శలు చేస్తానని చెప్పిన పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించిన పేర్ని నాని… తనతో పాటు పలువురు వైసీపీ నేతలపై పలు సందర్భాల్లో పవన్ చేసిన విమర్శలను గుర్తు చేశారు. ఇవన్నీ విధానపరమైన విమర్శలా?… లేదంటే వ్యక్తిగతమైన విమర్శలా? అని ఆయన పవన్ ను పేర్ని నాని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news