ఉయ్యూరు ట్రస్టు కార్యక్రమం అనేది ఒక డ్రామా : పేర్ని నాని

-

నిన్న టీడీపీ ఎన్నారై ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రన్న కానుక కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు చంద్రబాబుకు సిగ్గనిపించడంలేదా? అని ప్రశ్నించారు పేర్ని నాని. చంద్రబాబు సభలకు జనం రావడంలేదని, జనాన్ని తరలించారని ఆరోపించారు. గుంటూరు సభకు ఇన్నివేలమందిని తరలించడం ఉయ్యూరు ట్రస్టుకు సాధ్యమయ్యే పనేనా…? అని పేర్ని నాని నిలదీశారు. ఉయ్యూరు ట్రస్టు కార్యక్రమం అనేది ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు పేర్ని నాని. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ముగ్గురి ప్రాణాలు బలిగొన్నారని అన్నారు పేర్ని నాని.

10 వేల మందికి ఆహ్వానం అని ప్రకటనలో పేర్కొని, 30 వేల మందికి టోకెన్లు ఇచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారని పేర్ని నాని మండిపడ్డారు పేర్ని నాని. ఘటన జరిగిన వెంటనే టీడీపీ నేతలు ప్లేటు ఫిరాయించారని పేర్ని నాని విమర్శించారు. ఇది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, పోలీసులు తమ పని తాము చేస్తారని స్పష్టం చేశారు. “ప్రతి వారం ఆదివారం నాడు సెలవు దొరకగానే ఒక అడ్డగాడిద వచ్చి జగన్ గారిని తిట్టి వెళ్లిపోతుంది. ఇప్పటంలో కూడా ఎల్లో మీడియా, ఆ ఆదివారం అతను రచ్చ చేశారు. ఒక ప్రహరీ గోడ కూల్చివేస్తే ప్రశ్నించినవారు ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడడంలేదు” అని విమర్శించారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version