ప్రశాంత్ కిషోర్..పీకే…రాజకీయాలు గురించి తెలిసినవారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే టాప్‌లో ఉన్న పీకే…అనేక మంది నేతలకు గొప్ప విజయాలు అందించారు. ఎన్నికల సమయంలో తన వ్యూహాలతో అనేకమంది నాయకులని గెలిపించారు. తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులకు చెక్ పెట్టేవారు. పీకే స్ట్రాటజీలతోనే జగన్, స్టాలిన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ లాంటి వారు గద్దెనెక్కారు.
ఇలా కేసీఆర్ చేయడం వెనుక పీకే ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇటీవల కేసీఆర్, ప్రశాంత్ కిషోర్‌ను కలుస్తున్నారని.. పీకే డైరెక్షన్ లోనే కేసీఆర్ ఆందోళనలు, భౌతిక దాడులకు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసీఆర్‌కు పీకే వ్యూహాలు తీసుకునే అవసరం ఉందా? అసలు కేసీఆరే పెద్ద వ్యూహకర్త. మరి అలాంటప్పుడు ఆయనకు కూడా పీకే అవసరం పడిందా? అంటే పరిస్తితులని చూస్తే అదే నిజమే అనిపిస్తోంది.
బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో కేసీఆర్..పీకేని ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది. పైగా ఎప్పుడూలేని విధంగా తెలంగాణలో కూడా బూతులు, దాడుల రాజకీయం నడుస్తోంది. ఏపీలో ఇదే తరహా రాజకీయం నడుస్తోంది. అక్కడ అధికార వైసీపీకి పీకే సపోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయం బట్టి చూస్తే ఇక్కడ కూడా పీకే ఎంట్రీ ఇచ్చినట్లే కనిపిస్తోంది.