రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న స్కీముల్లో ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. కేంద్రం రైతులకు రూ. 6000 ని ఈ స్కీమ్ ద్వారా అందిస్తోంది. ఈ స్కీమ్ కింద మూడు విడతల్లో ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులని ఇస్తోంది. చాలా మంది రైతులు ఈ స్కీమ్ ప్రయోజనాలని పొందుతున్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం నేరుగా విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి డబ్బులని వేస్తూ వచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2.25 లక్షల కోట్లు పంపిణీ చేసింది కేంద్రం. తాజాగా రైతుల అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. మరి మీ అకౌంట్ లోనూ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలా ఆయితే ఇలా చెక్ చేసేయండి.
దీని కోసం ముందు మీరు https://pmkisan.gov.inకి వెళ్లి లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత మీరు ఫార్నర్ కార్నర్ మీద క్లిక్ చెయ్యండి.
ఇప్పుడు మీరు ‘ఫార్నర్ కార్నర్ ‘లో లబ్ధిదారుల జాబితా మీద క్లిక్ చేయాలి.
ఆ తరవాత మీరు మీ రాష్ట్రం, జిల్లా, తహసీల్, బ్లాక్, గ్రామాన్ని సంబంధించిన వివరాలు ని
ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ మీరు ‘గెట్ రిపోర్ట్’ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీకు అన్ని వివరాలతో లబ్దిదారుల జాబితా స్క్రీన్ పై కనపడతాయి.
ఇలా ఈజీగా మీరు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు.