ఏపీ సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్… వరద పరిస్థితులపై ఆరా..

-

వాయుగుండం ఆంధ్ర ప్రదేశ్ ను వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా ఏపీలో వర్షాలు, వరదల పరిస్థితుల గురించి ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. నిన్నటి నుంచి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద గురించి ప్రధాని మోదీ, సీఎం జగన్ ను అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వ చర్యల గురించి, 5 జిల్లాల్లో వర్షాల పరిస్థితులను సీఎం జగన్, మోదీకి వివరించారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

వర్షాల కారణంగా ఇబ్బందుల చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపుర్ జిల్లాల్లో వర్షాల తీవ్రత గురించి ప్రధానికి జగన్ మోహన్ రెడ్డి వివరించారు. సహాయక కార్యక్రమాల కోసం నావీ హెలికాప్టర్లను కూడా వినియోగించుకుంటున్నట్లు ప్రధాని ద్రుష్టికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా పలు జిల్లాల్లో చెరువులకు గండ్లు పడుతున్నాయి. వాగులు తీవ్ర రూపంలో ప్రవహిస్తున్నాయని ప్రధాని ద్రుష్టికి తీసుకువచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news