ప్రధాని మోడీకి గ్రీస్‌లో అత్యున్నత గౌరవం..

-

గ్రీస్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత గౌరవం దక్కింది. గ్రీస్ అధ్యక్షురాలు కటారినా ఎన్ సకెల్లారోపౌలౌ ప్రధాని మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్‌ ను ప్రదానం చేశారు. ప్రధాని మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గ్రీస్ చేరుకున్నారు. చంద్రయాన్-3 విజయం భారత్‌కే కాదు.. యావత్ మానవాళికి దక్కిన విజయం అని గ్రీస్ అధ్యక్షురాలు కటారినా ఎన్ సకెల్లారోపౌలౌతో ప్రధాని మోదీ అన్నారు.

గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. భేటీ అనంతరం మాట్లాడిని మోడీ..వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య, డిజిటల్ చెల్లింపులు, ఫార్మా, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్‌- గ్రీస్‌ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామిగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. భారత ప్రధాని మోడీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సమావేశాలు ముగిసిన అనంతరం నేడు గ్రీస్‌కు వెళ్లారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్‌ ఆహ్వానంపై మోదీ గ్రీస్ పర్యటనకు వెళ్లారు. గత 40 ఏళ్లలో భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version