అన్నదాతలకు గుడ్ న్యూస్.. బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు ఎప్పుడంటే..?

-

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిలో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ లో భాగంగా రైతులకి ప్రతీ సంవత్సరం కూడా రూ.6 వేలు లభిస్తున్నాయి. ఈ డబ్బులన్నీ ఒకేసారి రావు. విడతల వారీగా వస్తాయి.

farmers

అంటే మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కేంద్రం ఇప్పటికే రైతులకి రూ.18 వేలు జమ చేసింది. ఇప్పుడు పదో విడత కింద మరో రూ.2 వేలు రానున్నాయి.

ఇక ఈ డబ్బులు ఎప్పడు వస్తాయి అనేది చూస్తే.. డిసెంబర్ 15 కల్లా ఈ పదవ విడత డబ్బులు రైతులు ఖాతా లో పడనున్నాయని తెలుస్తోంది. అంటే కొత్త ఏడాది కన్నా ముందే డబ్బులు వచ్చేస్తాయి. ఇది ఇలా ఉంటే మీరు ఈజీగా ఈ స్కీమ్ కింద డబ్బులు వస్తాయా లేదా అని తెలుసుకొచ్చు.

ఇక దీని వివరాలను చూస్తే… పీఎం కిసాన్ స్కీమ్‌ కింద పదో విడత డబ్బులు వస్తాయా లేదా అనేది పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి.. ఫార్మర్స్ కార్నర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు బెనిఫీషియరీ స్టేటస్ ఎంచుకోవాలి. నెక్స్ట్ మీరు అక్కడ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తే మీ పేరు వుందో లేదో చెక్ చేసుకుని తెలుసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news