పెళ్లిపేరుతో యువతిని లొంగదీసుకున్న కానిస్టేబుల్‌..

-

యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఓ కానిస్టేబుల్‌.. తన శారీరక సుఖం పొందాక ముఖంచాటేశాడు. పెళ్లి చేసుకోమ్మంటే.. చేసుకోనని బురడి కొట్టించాడు. అప్పడికే తనతో లైంగికంగా దగ్గరైన యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కానిస్టేబుల్ విక్రాంత్‌పై రేప్ కేసును బుక్ చేశారు. ఓ మ‌హిళ‌ను పెళ్లి చేసుకుంటాన‌ని హామీ ఇచ్చి, ఆమెతో శృంగారంలో పాల్గొని, ఆ త‌ర్వాత పెళ్లికి నిరాక‌రించిన‌ట్లు ఆ కానిస్టేబుల్‌పై కేసును ఫైల్ చేసి అరెస్టు చేశారు.

Gorakhpur: Cops launch 'Operation Asmita' to prevent sexual harassment in  schools | Cities News,The Indian Express

కాన్పూర్ దీహ‌త్ పోలీస్ స్టేష‌న్‌లో విక్రాంత్ విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అత‌ని స్వ‌స్థ‌లం ముజాఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాలోని దోల్రా గ్రామం. ఆదివారం అత‌న్ని షామ్లీలో అరెస్టు చేశారు. మ‌హిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్‌పై కేసును రిజిస్ట‌ర్ చేశారు. పెళ్లి చేసుకుంటాన‌ని ప్రామిస్ చేసి త‌న‌ను ఆ కానిస్టేబుల్ రేప్ చేశాడ‌ని, ఆ త‌ర్వాత అత‌ను పెళ్లికి నిరాక‌రించిన‌ట్లు ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది.

Read more RELATED
Recommended to you

Latest news