కొన్ని నెలల కిందట కేజీ రూ.10 కంటే తక్కువ పలికిన టమాటా ధర ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో టమాటా ధరలు కిలో రూ.150 నుంచి దిగి రానంటున్నాయి. ఒకప్పుడు ధర లేక రైతులు రోడ్డుపక్కన పారబోసిన స్థితి నుంచి, ఇప్పుడు అత్యంత ప్రియంగా మారిన స్థితికి టమాటా ధరలు చేరుకున్నాయి.
తమిళనాడుకి చెందిన ఓ జంట టమాటాల కోసం పెద్ద నాటకమే ఆడింది. 2.5 టన్నులున్న ఓ ట్రక్‌ని హైజాక్ చేసింది. బెంగళూరు నుంచి ట్రక్‌ని చోరీ చేసి తీసుకెళ్లిపోయింది. యాక్సిడెంట్ డ్రామా ఆడి సింపుల్‌గా ట్రక్‌ని ఎత్తుకెళ్లిపోయారు. వెల్లూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…హైవేపై కొందరు ముఠాలు ఇలా ట్రక్‌లను దొంగిలిస్తున్నారు. అయితే తమిళనాడుకి చెందిన ఓ జంట తమ కార్‌తో ఓ ట్రక్‌ని కావాలనే ఢీకొట్టింది. ఆ తరవాత ఆ ట్రక్ డ్రైవర్‌తో గొడవపడింది. రిపేర్ చేయించుకోడానికి డబ్బులివ్వాలని డిమాండ్ చేసింది. ఆ ట్రక్ డ్రైవర్ ఓ రైతు. డబ్బులివ్వను అని తేల్చి చెప్పాడు. మాట్లాడుతుండగానే ఈ జంట రైతుపై దాడి చేసింది. ట్రక్ నుంచి రైతుని బయటకు లాగేసింది. 2.5 టన్నులున్న ఆ ట్రక్‌ని ఎత్తుకెళ్లింది. వాటి విలువ రూ.2.5 లక్షలు. జులై 8న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. రైతు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఆ ట్రక్‌ని గుర్తించారు. నిందితులు భాస్కర్, సింధూజను అరెస్ట్ చేశారు. వీళ్ల గ్యాంగ్‌లో మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వాళ్లనూ పట్టుకుంటామని స్పష్టం చేశారు పోలీసులు.