సిక్కోలు…. ఈసారి ఎవరిదో ..!

-

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి ప్రత్యేకత ఉంది.1952 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా మరో నెల రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల బరిలో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ నేతలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో తలమునకలై దూసుకుపోతున్నారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గ ప్రజలు టీడీపీని ఆదరిస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి గుండ కుటుంబ సభ్యులే ఐదుసార్లు విజయం సాధించారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం వేదికగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల సరళిని ఓసారి పరిశీలిద్దాం

 

1952లో ఏపీ అసెంబ్లీ ఏర్పాటైన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కేఎల్పీ నుంచి పోటీ చేసిన కెఏ నాయుడు కాంగ్రెస్ అభ్యర్థి టి పాపారావుపై 2664 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పి సూర్యనారాయణ ఇక్కడ విజయం సాధించారు.1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఏ తవిటయ్య విజయం సాధించగా 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సత్యనారాయణ గెలుపొందారు.1972 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన లక్ష్మినారాయణ ఇక్కడ నుంచి గెలిచారు.1978లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన సి లక్ష్మినారాయణ ఇక్కడి నుంచి మరోసారి విజయం సాధించారు.1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక ఇక్కడ ఆ పార్టీ ప్రభావం మొదలైంది.1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తంగి సత్యనారాయణ ఇక్కడి నుంచి విజయం సాధించారు.

1985,1989,1994,1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ అప్పల సూర్యనారాయణ నాలుగుసార్లు వరుస విజయాలను అందుకున్నారు.వై యెస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఫలితంగా 2004లో కాంగ్రెస్ తరపున ఇక్కడ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు. వరుసగా నాలుగుసార్లు గెలుస్తూ వచ్చిన గుండ అప్పల సూర్యనారాయణ విజయాలకు ధర్మాన బ్రేక్ వేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మరోసారి ధర్మాన ప్రసాదరావు విజయం సాధించారు.2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ లక్ష్మీదేవి వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుని ఓడించారు.అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మిదేవిపై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు.వై ఎస్ జగన్ కేబినెట్లో ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ వచ్చాక శ్రీకాకుళం నియోజకవర్గంలో 9సార్లు ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు టీడీపీ గెలిచింది.ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు మూడుసార్లు గెలిచి ఒక్కసారి ఓడిపోయారు. మరోసారి 2014 ఎన్నికల్లో ఇక్కడినుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది ఇంతవరకు ఖరారు కాలేదు.ఇక ఈ నియోజకవర్గoలో 2,24,395 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,12,490 మంది పురుషులు ఉండగా, 1,12,892 మంది మహిళలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version