ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో జంగారెడ్డి గూడెం మరణాలు, టీడీపీ ఆరోపణలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. టీడీపీ అబద్ధాలకు ఈనాడు, టీవీ5, ఆంధ్రప్రదేశ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పడం ద్వారా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన విమర్శించారు. జరగని ఘటనను జరిగినట్లు కొంతమంది మీడియా ప్రతినిధులు చూపిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. మాకు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వాలని… మంచి విషయాలు చెప్పాలని టీడీపీ సభ్యులకు జగన్ సూచించారు. ఈవిధంగా సభలో గందరగోళం కలిగించవద్దని సూచించారు. సారా కాసేవాడు ఎవరైనా..55 వేలు జనాభా ఉంటున్న జంగారెడ్డి గూడెంలో ఎవరైనా సారా కాస్తారా..? అని సీఎం జగన్ ప్రశ్నించారు. సారా కాసేవారికి తోడుగా ప్రభుత్వం ఉండని.. వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని ఆయన అన్నారు. సారా తాగిస్తే ప్రభుత్వానికే ఆదాయం తగ్గుతుంది కదా అని జగన్ అన్నారు. రెండేళ్లలో సారాపై 13 వేల కేసులు నమోదు చేశామని అసెంబ్లీలో వెల్లడించారు. చోటు చేసుకున్న మరణాలు ఒకేసారి జరగలేదని.. వారం రోజుల వ్యవధిలో జరిగాయని.. సాధారణ మరణాలను టీడీపీ ట్విస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అబద్ధాలకు.. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి: సీఎం జగన్
-