కేడర్ తో మాట్లాడనున్న సీఎం జగన్… ఎప్పటినుంచి అంటే..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ కేడర్ ని మరింత ఉత్సాహపరిచి ఎలక్షన్ కి సిద్ధం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ పర్యటనకు శ్రీకారం చుట్టారు.సంక్రాంతి తరువాత 25 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 5 రీజియన్ లలో క్యాడర్ మీటింగ్”లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు.

వైనాట్ 175 నినాదాన్ని కార్యకర్తల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే తానే స్వయంగా కేడర్ తో మాట్లాడటమే కరెక్ట్ అని అధినేత అనుకుంటున్నారు. సుదీర్ఘ కాలం తరువాత ఆయన నేరుగా కేడర్ కి టచ్లోకి వచ్చే ఆలోచన చేయడంతో పార్టీలోని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల తరువాత అభిమాన నేతతో నేరుగా మాట్లాడబోతున్నామని సంతోషంగా ఫీల్ అవుతున్నారు.

కేడర్ తో సీఎం జగన్ భేటీ రీజియన్ల వారీగా జరుగనుంది. 4 లేదా ఆరు జిల్లాలను కలిపి ఒక రీజియన్ గా వైసీపీ విభజించింది. వీళ్ళందర్నీ ఒకచోటికి పిలిపించుకుని మాట్లాడేందుకు సీఎం సమాయత్తమయ్యారు.క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీయడంతోపాటు కార్యకర్తల కష్ట నష్టాలను,సమస్యలను కూడా అధినేత తెలుసుకొనున్నారు. వారికి మరింతగా భరోసా ఇచ్చి రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

పార్టీ సభ్యులందరినీ ఏకంచేయడంతో పాటు వారిలో చైతన్యం నింపుతూ రాబోయే ఎన్నికల్లో 175 /175 సీట్లలో గెలిచేలా వారిని సంసిద్ధం చేయడమే ఈ సమావేశాల యొక్క ముఖ్యమైన లక్ష్యం.ఇందులో భాగంగా మొదటి సమావేశం జనవరి 25 వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.మిగిలిన 4 ప్రాంతాల సమావేశాల తేదీలపై కసరత్తు జరుగుతోంది.ఒక్కో మీటింగ్ కి 3లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version