ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. టీడీపీకి కేంద్రం దిమ్మతిరిగే ఆన్సర్.!

-

జగన్ ఎంతసేపు సంక్షేమ పథకాలు అంటూ బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నారు..అవి కూడా అప్పులు చేయడం, లేదా ప్రజలపై పన్నుల భారం మోపి డబ్బులు వేస్తున్నారని, దీని వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని, అసలు ఆదాయం సృష్టించడం లేదని, రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడం లేదని, ఉన్న కంపెనీలు పోతున్నాయని టి‌డి‌పి పదే పదే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే టి‌డి‌పి చేసే విమర్శలు అన్నీ తప్పు అనే విషయం ప్రజలకు తెలుసు. ఒకవేళ అధికార వైసీపీ..రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పిన టి‌డి‌పి మీడియా ఏదొక విధంగా వక్రీకరిస్తుంది. కానీ కేంద్రం చెప్పే లెక్కలని వక్రీకరించడం టి‌డి‌పి వల్ల కాదు..పైగా టి‌డి‌పి అడిగిన ప్రశ్నలకే కేంద్రం సమాధానం ఇస్తే ఇంకా తిరుగుండదు. ఇప్పటికే ప్రజలపై భారం మోపుతున్నారనే టి‌డి‌పి అబద్దాలకు చెక్ పెడుతూ..రాష్ట్రంలో పేదరికం సగానికి సగం తగ్గిందని కేంద్రం ఇచ్చిన రిపోర్టు తేల్చి చెప్పేసింది.

ఇక ఇప్పుడు ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. తాజాగా రాజ్యసభలో టి‌డి‌పి ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్..రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదనే ఉద్దేశంతో.. పెట్టబడులకు సంబంధించి ప్రశ్న వేశారు. దీనికి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ సమాధానం ఇస్తూ..ఏటా ఏపీలో పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయని లెక్కలతో కూడిన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కోవిడ్ వల్ల ప్రపంచమే స్థంభించింది. ఇక దాని ప్రభావం వలన 2020-21 మధ్య మాత్రం ఏపీలో పెట్టుబడుల్లో క్షీణత ఉందని, తర్వాత క్రమేపీ పెరిగాయని..రికార్డు స్థాయిలో 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.

ఇక 2019 అక్టోబర్ – 2020 మార్చ్ మధ్య : 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు రాగా, 2020- 21 : 85.85 మిలియన్ డాలర్లు, 2021-22 : 224.96 మిలియన్ డాలర్లు, 2022-23 : 284.22 మిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ దెబ్బతో టి‌డి‌పి ఎంపీకి సౌండ్ లేదనే చెప్పాలి. అలాగే జగన్ పెట్టుబడులు తీసుకురావడం లేదని విమర్శలు చేసే టి‌డి‌పికి, దాని అనుకూల మీడియాకు కేంద్రం సమాధానం పెద్ద షాక్ అనే చెప్పాలి.

అసలు రాష్ట్రంలో ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రేసు గుర్రాల మాదిరిగా పరిగెడుతున్నాయి. జగన్ పాలనలోనే ఇదంతా జరుగుతుంది. కానీ ఎక్కడ అవకాశం దొరుకుతుందా జగన్‌ని విమర్శించాలని చెప్పి టి‌డి‌పి కాచుకుని కూర్చుంది. అయితే టి‌డి‌పికి గణాంకాలతో సహ కేంద్రమే బుద్ధి చెబుతుందని చెప్పవచ్చు. ఇక జగన్ సారధ్యంలోని ప్రభుత్వం సైతం పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు ప్రకటిస్తూనే వాళ్లకు అన్నివిధాలా సహకారం అందిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో దేశంలోనే ఏపీ నంబర్ -1 లో నిలిచింది. మళ్ళీ జగన్ వస్తే..రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version