ఇటీవల ఏపీలో ఒకే అంశంపై ఎక్కువ చర్చ నడుస్తోంది..ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా సరే ఇప్పటినుంచే పొత్తు గురించి ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి…నెక్స్ట్ చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేస్తారని, వారిద్దరు కలిస్తే జగన్ గెలుపుకు ఇబ్బందే అని కొందరు మాట్లాడుతుంటే, లేదు లేదు కలిసి పోటీ చేసిన, విడిగా పోటీ చేసిన జగన్ ని ఏం చేయలేరని మరికొందరు మాట్లాడుతున్నారు. ఇక టీడీపీ సింగిల్ గానే పోటీ చేసి వైసీపీకి చెక్ పెడుతుందని…టీడీపీకి అనుకూలంగా ఉండేవారు మాట్లాడుతున్నారు. అటు జనసేన కూడా ఈ సారి సత్తా చాటుతుందని…పవన్ అభిమానులు అంటున్నారు. అంటే ఇక్కడ ఎవరి వర్షన్ వారికి ఉంది.
అయితే ఏపీ రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారికి పొత్తు ఉంటే ఎలా ఉంటుంది..పొత్తు లేకపోతే పరిస్తితి ఎలా ఉంటుందో అర్ధమవుతుందని చెప్పొచ్చు. ఒకవేళ టీడీపీ-జనసేన పొత్తు ఉంటే ఖచ్చితంగా వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి…పైకి వైసీపీ నేతలు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన సరే…జరిగే నష్టం జరగక మానదు. ఇక పొత్తు లేకపోతే పరిస్తితి ఎలా ఉంటుందో చూడాలి…అలాగే పొత్తు ఉంటే ఒకలా, పొత్తు లేకపోతే మరొకలా టీడీపీకి నష్టం ఉంటుంది…జనసేనకు కూడా అంతే. మరి చివరికి పొత్తు ఏం అవుతుందో ఎవరికి క్లారిటీ లేదు.
కాకపోతే ఇక్కడ వైసీపీ నేతలే కాస్త క్లారిటీ తెచ్చుకుని పొత్తు పట్ల అలెర్ట్ గా ఉండాలని చెప్పొచ్చు.. ఎందుకంటే పొత్తు ఉంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ తప్పదు..కానీ అదేం పట్టించుకోకుండా తమకు ఏమి నష్టం జరగదని, మళ్ళీ 151 సీట్లు గెలుచుకుంటామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.. ఇలాగే ముందుకెళితే ఎన్నికల సమయంలో దెబ్బతినక తప్పదు.. కాబట్టి టీడీపీ-జనసేన పొత్తు విషయంలో వైసీపీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా జగన్ తోనే జనం ఉన్నారని, బాబు-పవన్ కలిసిన ఉపయోగం లేదని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటే చిక్కుల్లో పడతారు.