పొత్తు పొడిసేనా – టీడీపీ క‌ప్ప‌గెంతులు.. బిజేపీతో పొత్తుకై ఎత్తులు?

-

ఏపీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా బిజెపి బలం ఏమిటో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కాస్త తెలిసొచ్చాయి. తెలంగాణలో రానున్న రోజుల్లో సత్తా చాటే అంతటి శక్తి యుక్తులు బిజెపికి ఉన్నాయని అందరిలోనూ నమ్మకం ఏర్పడింది. ఇక ఏపీలో ను బిజెపి తెలంగాణను పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్ర బిజెపి పెద్దలు సైతం ఇకపై పార్టీ నాయకులంతా సమిష్టిగా ముందుకు వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని అప్పుడే సంకేతాలు సైతం ఇవ్వడంతో ఆ పార్టీ నాయకులు ఉత్సాహం కనిపిస్తోంది.
TDP BJP party

ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆరాటపడుతున్న తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా బీజేపీకి దగ్గరవ్వాలని ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల వ్యవహారం పై కీలకంగా వ్యవహరిస్తూ బీజేపీలోని తెరాస నాయకులతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉన్న బీజేపీకి మద్దతు ప్రకటిస్తుందని విషయాన్ని వారి వద్ద చెప్పినట్లు తెలుస్తోంది అలాగే అవసరమైతే త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో పోటీకి దూరంగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదనే విషయాన్ని బిజెపి పెద్దల వద్దకు రాయబారాలు పంపినట్లు సమాచారం.

గ్రేటర్ తో పాటు తిరుపతి స్థానాలను త్యాగం చేయడం ద్వారా రానున్న రోజుల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి బిజెపి అన్ని విషయాలు సహకరిస్తుందని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వేధింపుల నుంచి పార్టీ నాయకులకు ఉపశమనం లభిస్తుందని బాబు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతం బిజెపి నేతలు టిడిపిని వీలైనంత దూరంగా పెడుతున్నావు తరుణంలో ప్రయత్నాలు అవుతాయనేది ఉత్కంఠగా మారింది. అయితే బాబు మాత్రం పట్టు విడవకుండా ఆర్ఎస్ఎస్ కీలక నాయకులు తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని బీజేపీతో పొత్తు సెట్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా టిడిపిలో టాక్. ప్రస్తుతం ఏపీ బీజేపీ లో ఒక వర్గం నాయకులు టిడిపికి పరోక్షంగా మద్దతు ఇస్తుండగా సోము వీర్రాజు వంటివారు టిడిపిని ఏపీలో బలహీనం చేయాలనే విషయంపైనా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు ఈ తరుణంలో కేంద్రం బిజెపి పెద్దల వైఖరి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు టిడిపి నేతలకు ఉత్కంఠ కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news