అంబేద్కర్ విగ్రహంతో కేసీఆర్ రాజకీయం..దళిత సీఎం ఎక్కడ?

-

హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ అంశంపై బి‌ఆర్‌ఎస్ నేతలు కే‌సి‌ఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్ర బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్..కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

కొన్ని లాజిక్ లతో ఫైర్ అయ్యారు. అయితే చాలాసార్లు నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన కేసీఆర్ ఏ ఒక్కరోజు కూడా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లలేదని, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ కే‌సి‌ఆర్ కు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పటివరకు చేయలేదని గుర్తుచేశారు. అలాగే ఏనాడూ కూడా అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కే‌సి‌ఆర్  హాజరు కాలేదని చెప్పుకొచ్చారు.

ఇక దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైందని, దళితబంధుని సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. దళితబంధు పథకం నిధుల పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఎన్నికలు వస్తున్న కారణంగానే కెసిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి దళిత ఓటు బ్యాంకు కోసం రాజకీయం చేస్తున్నారని సంజయ్ ఫైర్ అయ్యారు.

అయితే బండి చేసే విమర్శల్లో కొన్ని లాజిక్ లు ఉన్నాయి..దళిత ఓటు బ్యాంకుపై కన్నేసి కేసీఆర్ అంబేద్కర్ విగ్రహంపై ఫోకస్ పెట్టి ఉండవచ్చు. రాజకీయం లేనిదే కేసీఆర్ ఏది చేయరనే సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news