హరీష్ రావు ముందే యువకుడి రచ్చ… ఈటల ఇచ్చిన గడియారాలు పగలగొట్టి మరీ !

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా కొన సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫి కేషన్‌ రాకముందే… అన్ని పార్టీలు అక్కడ ప్రచారం చేసేస్తున్నాయి. అలాగే… ఇతర పార్టీ నుంచి లీడర్లను తమ వైపునకు లాగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే తాజాగా జమ్మికుంట పట్టణంలోని ఏంపిఆర్ గార్డెన్స్ లో మంత్రులు తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ ల సమక్షంలో బిజేపి పార్టీకి చెందిన నాయకులు పలువురు టీఆరెఎస్ లో చేరారు.

అయితే.. ఈ సందర్భంగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశం లో టీఆరెఎస్ లో చేరిన పలువురు స్టేజి మీద మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ఇచ్చిన గోడ గడియారాలు ధ్వంసం చేశారు. అలాగే…. గొడుగులు చింపి వేశారు. దళిత వాడల్లో గడియారాలు, గొడుగులు పంచాలని ఈటల రాజేందర్‌ కోరాడని.. కానీ తాము దానికి నిరాకరించామని సమావేశం లోనే కుండ బద్దలు కొట్టారు. అయితే… ఈ సంఘటన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షం లోనే చోటు చేసుకుంది. ఇక ఆ యువకుల ఆవేశాన్ని చూసి.. హరీష్‌ రావు షాక్‌ గురయ్యారు.