చ‌రిత్ర‌లోనే భారీ ఉద్యోగ‌ నోటిఫికేషన్ : బాల్క సుమన్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఈ రోజు అసెంబ్లీలో ఉద్యోగ భ‌ర్తీ పై చేసిన ప్ర‌క‌ట‌నపై ప్ర‌భుత్వ విప్ ఎమ్మెల్యే బ‌ల్క సుమ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయ‌న గ‌న్ పార్క్ వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భ‌ర్తి చేసిన‌ట్టు లేద‌ని అన్నారు. ఈ ఘ‌న‌త కేవ‌లం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కే చెందుతుంద‌ని అన్నారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్ర‌భుత్వానికి చిత్త శుద్ధి ఉంద‌ని ఆయ‌న అన్నారు. చెప్పిన మాట ప్ర‌కారం ఉద్యోగాల భ‌ర్తీ చేస్తున్నామ‌ని తెలిపారు.

నేడు సీఎం కేసీఆర్ ఉద్యోగాల భ‌ర్తీపై ప్ర‌క‌ట‌న చేసి నిరుద్యోగుల జీవితాల్లో ఆనందం నింపార‌ని అన్నారు. కాగ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ల‌క్ష్యం నేర‌వేరింద‌ని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు.. కోసం చేసిన కోట్లాట చేశామ‌ని అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర క‌ల సాహ‌కారం అయింద‌ని అన్నారు.

అయితే కేంద్రంలో బీజేపీ కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏడాది 2 కోట్ల ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింద‌ని గుర్తు చేశారు. ఇప్ప‌టి వర‌కు దేశంలో ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేశార‌ని ప్ర‌శ్నించారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న‌ బీజేపీ ప్ర‌భుత్వం ఎన్ని ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేశారో చెప్పాల‌ని స‌వాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version