పవన్‌కు బీజేపీ దెబ్బ…టీడీపీ లైట్ తీసుకుంటుందా?

-

మొత్తానికి బీజేపీ…పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చినట్లే కనిపిస్తోంది..మిత్రపక్షంగా ఉంటూనే పవన్ ని దెబ్బవేస్తుందని చెప్పొచ్చు…జనసేన పార్టీ చేస్తున్న డిమాండ్ విషయంలో అసలు స్పందించకుండా…సైలెంట్ గా పవన్ కు హ్యాండ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది…పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించడంపై బీజేపీ వెనుకడుగు వేస్తుంది. అసలు పవన్ ని ..బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు లేదు.

అసలు మొదట నుంచి బీజేపీతో పవన్ సఖ్యతగానే ఉంటున్న విషయం తెలిసిందే..ఏదో మధ్యలో కాస్త గ్యాప్ వచ్చిన సరే…మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత పవన్…బీజేపీతో జట్టు కట్టారు. అయితే ఎన్నికలయ్యాక పొత్తు పెట్టుకోవడం రీజన్స్ బాగానే ఉన్నాయి..అప్పుడే జనసేన చిత్తుగా ఓడిపోయి ఉంది…పైగా వైసీపీ అధికారంలోకి వచ్చింది…దీంతో రాజకీయంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి సేఫ్ సైడ్ గా..కేంద్రంలో అధికారంలో బీజేపీతో పవన్ జట్టు కట్టారు.

ఇక బీజేపీ సైతం…ఏపీలో ఎదగడానికి ఒక బలమైన ప్రజా మద్ధతు ఉన్న నాయకుడు కావాలని చెప్పి..పవన్ తో పొత్తు పెట్టుకుంది. ఎలాగో ఏపీలో బీజేపీకి బలం లేదు…అదే పవన్ తో కలిస్తే కాస్త ప్లస్ అవుతుందని భావించింది. అయితే బీజేపీ-జనసేన పార్టీలు పేరుకు పొత్తులో ఉన్నాయి గాని..ఎప్పుడు కూడా ఉమ్మడిగా పనిచేయలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పనిచేశారు. అయితే ఇటీవల జనసేన…టీడీపీతో పొత్తు పెట్టుకోవచ్చని ప్రచారం మొదలైంది…ఆఖరికి అటు చంద్రబాబు, ఇటు పవన్ సైతం పొత్తు పట్ల ఆసక్తిగానే ఉన్నట్లు మాట్లాడారు.

కాకపోతే ఈ సారి తాము తగ్గమని పవన్ చెబుతున్నారు…అలాగే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని జనసేన కార్యకర్తలు టీడీపీని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ మిత్రపక్షమైన బీజేపీని కూడా డిమాండ్ చేశారు. కానీ బీజేపీ దీనిపై స్పందించలేదు…ఇక బీజేపీ వాలకం చూస్తే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించేలా లేదు. అసలు మిత్రపక్ష పార్టీ…పైగా ఒక్కశాతం ఓట్లు కూడా లేని బీజేపీనే…పవన్ కల్యాణ్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించకపోతే…అసలు 40 శాతం ఓట్లు ఉన్న తమని జనసేన ఎలా డిమాండ్ చేస్తుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తాం గాని…జనసేన డిమాండ్లకు ఒప్పుకునే పరిస్తితి లేదని అంటున్నారు. మొత్తానికి బీజేపీ వల్ల..పవన్ కే నష్టం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news