‘కేటీఆర్-హరీష్’ని కమలం నిలువరించగలదా!

-

తెలంగాణలో బీజేపీ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తుంది….టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం గ్యాప్ లేకుండా బీజేపీ రాజకీయంగా దాడి చేస్తుంది. అలాగే ఎక్కడకక్కడ టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తుంది. ఎలాగైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. అయితే ఇదే క్రమంలో తాజాగా బీజేపీ ఓ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చినట్లు కథనాలు వస్తున్నాయి…అది ఏంటంటే…టీఆర్ఎస్ కు ఆయువుపట్టుగా ఉన్న నలుగురు నేతలపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్లనుందని తెలుస్తోంది…వారి వారి నియోజకవర్గాల్లో చెక్ పెట్టేందుకు బీజేపీ అదిరిపోయే వ్యూహంతో ముందుకొస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఆ నలుగురుపై…బీజేపీ నుంచి బలమైన నాయకులని నిలబెట్టడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు. గజ్వేల్  బరిలో దిగుతానని చెప్పేశారు. అటు కవితపై ధర్మపురి అరవింద్ పోటీ చేయడం ఖాయమే.

ఇక సిద్ధిపేటలో హరీష్ పై రఘునందన్ పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు అంటున్నాయి…అలాగే సిరిసిల్లల కేటీఆర్ పై బండి సంజయ్ పోటీకి దిగుతారని తెలుస్తోంది. అయితే ఈ నలుగురుపై గెలుపే లక్ష్యంగా బీజేపీ పనిచేయనుంది. అయితే నలుగురుకు చెక్ పెట్టడం అనేది ఈజీ కాదు….కాకపోతే వారిని వారి నియోజకవర్గాల్లోనే స్ట్రక్ అయ్యేలా చేసి…రాష్ట్రంలో సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది…అదే బీజేపీ వ్యూహామని తెలుస్తోంది. కాకపోతే ఇందులో కేసీఆర్ నెక్స్ట్ ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ లేదు…అటు కవిత ఎంపీగా పోటీ చేయొచ్చు. కానీ కేటీఆర్, హరీష్ లని నిలువరించడం అనేది చాలా కష్టమైన పని..వారిపైన బలమైన  నేతలు పోటీ చేసిన సరే…వారు రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తారు. వారిని నియోజకవర్గాలకే పరిమితం చేయడం కష్టం. ఎందుకంటే వారి వారి నియోజకవర్గాల్లో గెలుపు ఈజీ. కాబట్టి వారిని నిలువరించడం చాలా కష్టం.

అసలు చెప్పాలంటే కేసీఆర్ ఫోర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తే…బ్యాగ్రౌండ్ లో వర్క్ చేసి పార్టీని నిలబెట్టేది కేటీఆర్, హరీష్ మాత్రమే. కాబట్టి వారిని కట్టడి చేస్తే బీజేపీకి ప్లస్ అవుతుంది…కానీ వారిని కట్టడి చేయడం సాధ్యమైన పని కాదు. మరి చూడాలి రానున్న రోజుల్లో కమలం ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news