మొత్తానికి మోదీ విజయ్ సంకల్ప్ సభ తర్వాత తెలంగాణలో బీజేపీ గేర్ మార్చింది..ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటూ రాజకీయం నడిపిన బీజేపీ..ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో కారుకు బ్రేకులు వేసి…కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదపనుంది. బీజేపీది ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పటినుంచి మరో లెక్క అన్నట్లు రాజకీయం నడపనుంది. మోదీతో పాటు ఇతర కేంద్ర పెద్దల సలహాలు, సూచనలు తీసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు…ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు సంస్థాగతంగా బలపడే దిశగా ముందుకెళ్లనుంది. మోదీ చెప్పినట్లుగా బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాల్సి ఉంది…అప్పుడే టీఆర్ఎస్ పార్టీని నిలువరించడం బీజేపీకి సాధ్యమవుతుంది.
అందుకే ఇప్పుడు ఆ దిశగా బీజేపీ ముందుకెళ్లనుంది…ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులని బీజేపీలో చేర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో బీజేపీకి పూర్తి స్థాయిలో బలమైన నాయకులు లేరు..అందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన నేతలని బీజేపీలోకి లాగే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారు. ఇక ఈ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నడవనుంది.
ఎందుకంటే ఈటలకు టీఆర్ఎస్ బలం ఏంటో…బలహీనతలు ఏంటో బాగా తెలుసు..పైగా ఆయనకు టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి…మొన్నటివరకు టీఆర్ఎస్ ఉండి వచ్చిన ఈటలకు..ఆ పార్టీ నేతలతో టచ్ లోనే ఉంటూ ఉంటారు. అందుకే ఈటలని ముందు పెట్టి కారుకు షాకులు ఇవ్వడానికి కమలం పార్టీ రెడీ అయింది. ఈ క్రమంలోనే ఈటలని చేరికల కమిటీ కన్వీనర్ గా నియమించారు. ఈ కమిటీలో డీకే అరుణ, కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్, కొండా విశ్వేశర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీ్‌పకుమార్ ఉన్నారు. కమిటీలో నాయకులకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులతో కాంటాక్టులు ఉన్నాయి…దాంతో ఆ పార్టీలకు చెందిన నాయకులని బీజేపీలోకి తీసుకురావడం ఈజీ అవుతుంది…మొత్తానికి ఇక నుంచి కమలం గేమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.