హలో మేము కూడా రేసులో ఉన్నాం… కాస్త చూడండి

-

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నామినేట్ పదవుల కోసం సీనియర్లు రేసులోకి వచ్చారు.ఇప్పటికే టీడీపీ, జనసేన నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలు తీసుకోగా, భవిష్యత్‌లో ఏర్పడే ఖాళీలను తమకు కేటాయించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇక చాన్స్‌ వస్తే ఫస్ట్‌ తమ పేరే ఉండాలని సీనియర్లు అయిన సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి కోరుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరూ గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, పొత్తుల్లో వారికి సీట్లు దక్కకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ చాన్స్‌ ఇవ్వాలని టాక్ నడుస్తోంది. వారితో పాటు సుదీర్ఘకాలం పార్టీలో కొనసాగుతూ కేవలం పార్టీ పదవులకే పరిమితమైన సీనియర్లు సైతం రేసులోకి దూసుకొస్తున్నారు.ఈసారి ఎలాగైనా ఏదో ఒక పదవి సాధించాలని సిద్ధమైపోయారు.

బీజేపీలో ఏ పదవులు భర్తీ చేయాలన్నా ముందుగా పార్టీలో ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇలాంటి కోటాలోనే కేంద్ర సహాయమంత్రిగా భూపతిరాజు శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్‌ పదవులు దక్కించుకున్నారు. దీంతో ఎమ్మెల్సీలుగా తమకే ముందు అవకాశం వస్తుందని ఆశ పడుతున్నారు విష్ణువర్ధన్ రెడ్డి, వీర్రాజు.ఈ ఇద్దరికీ సంఘ్ నేపథ్యం ఉంది. పార్టీలోనూ వీళ్లకు ఎలాంటి పదవులు లేవు.వీర్రాజు గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా… ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఇద్దరికీ జాతీయస్థాయిలో పరిచయాలు ఉండటంతో ఎవరికి వారు అధిష్టానం ముందు డిమాండ్ ని ఉంచుతున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజికవర్గ నేత వీర్రాజు, రాయలసీమ ప్రాంతంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత విష్ణు.బలమైన సమాజికవర్గాల నుంచి వచ్చారు కాబట్టి పదవులు ఇస్తే పార్టీ అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.

కూటమి పొత్తు ధర్మంలో అన్ని రకాల లెక్కలు చూసుకుని పదవులు ఇవ్వాలి.సోము వీర్రాజు 2014లో అప్పటి సంకీర్ణ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా చేశారు.అధికార టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసే తప్పులను నిర్మొహమాటంగా ఎత్తిచూపేవారు.దీంతో ఇప్పుడు ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ దక్కుతుందనడం అనుమానమే.వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్‌ నుంచి పోటీ చేయాలని వీర్రాజు భావించారు.కానీ చాన్స్‌ దక్కలేదు.అందమే ఇప్పుడు ఎమ్మెల్సీ అడుగుతున్నారు.ఇక విష్ణు సైతం హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని భావించినా పొత్తుల్లో భాగంగా ఆ సీటు దక్కలేదు.అందుకే ఇప్పుడు తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అదుష్టానంకు లెటర్ పెట్టుకున్నారు. మరి ఈ ఇద్దరి సీనియర్ల డిమాండ్లను పార్టీ అధిష్టానం నెరవేరుస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version