ఆ జిల్లాలో కారుని రివర్స్ చేస్తున్న కమలం..!

-

తెలంగాణలో కారు పార్టీ పరిస్తితి పూర్తిగా రివర్స్ అవుతుంది..ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా నడిచిన రాజకీయం…కొంతకాలం నుంచి రివర్స్ లో నడుస్తోంది..ముఖ్యంగా బీజేపీ దెబ్బకు కారు కకావికలం అవుతుంది. గత ఎన్నికల్లో అన్నీ జిల్లాలోనూ సత్తా చాటిన టీఆర్ఎస్ పార్టీ…ఇప్పుడు అన్నీ జిల్లాల్లోనూ కారుకు ఎదురుగాలి వీస్తుంది. అదే సమయంలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయం పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటుని బీజేపీ కైవసం చేసుకుందో..అప్పటినుంచి ఆ జిల్లాలో కారు రివర్స్ అవుతూనే వస్తుంది. నిదానంగా కమలం పార్టీ బలపడుతూ వస్తుంది. ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో గట్టి పోటీ తప్పదని తేలింది. అయితే ఇటీవల వచ్చిన పలు సర్వేల ప్రకారం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్తితులని ఒక్కసారి గమనిస్తే…దాదాపు జిల్లాలో సగం పైనే నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని తెలుస్తోంది.

10 స్థానాలు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో…టీఆర్ఎస్ కు బలం ఎక్కువే..గత ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకుంది…కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు దక్కింది. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయింది. దీంతో ఆదిలాబాద్ పై టీఆర్ఎస్ పార్టీకి పూర్తి పట్టు వచ్చింది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటు బీజేపీ గెలుచుకుంది. దీంతో సీన్ రివర్స్ అయింది. అక్కడ నుంచి బీజేపీ బలపడటం మొదలైంది.

ఇప్పటికే సగం నియోజకవర్గాలపై బీజేపీ పట్టు సాధించినట్లు కనిపిస్తోంది. ఆదిలాబాద్, చెన్నూరు, నిర్మల్, బోథ్, బెల్లంపల్లి లాంటి నియోజకవర్గాల్లో బీజేపీ బలం పెరిగింది. అయితే ఎన్నికలనాటికి జిల్లాలో బీజేపీ బలం ఇంకా పెరిగేలా ఉంది. అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన నేతని నిలబడితే ఆదిలాబాద్ లో కమలం పార్టీకి తిరుగుండదు.

Read more RELATED
Recommended to you

Latest news