కారు ‘కోట’లో కమలం జోరు?

-

ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ హవా సాగిన నియోజకవర్గాల్లో కమలం జోరు పెరుగుతుంది..అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో..ఎక్కడకక్కడ బీజేపీ బలం పుంజుకుంటుంది. రెండోసారి అధికారంలో కొనసాగుతున్న కారు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఊహించని విధంగా పెరుగుతుంది…ఈ క్రమంలోనే కారు పార్టీకి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో కూడా కమలం పార్టీ హవా మొదలవుతుంది.

ఇదే క్రమంలో ఇంతవరకు నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ హవానే కొనసాగింది…గత ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 సీట్లని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇక్కడ సీన్ మారింది…అనూహ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ లో బీజేపీ విజయం సాధించడంతో…అక్కడ సీన్ మారిపోయింది…ఈ మూడేళ్లలో అక్కడ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటూ వస్తుంది.

ఇప్పటికే అక్కడ కారు పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా కమలం ఎదిగింది…ఇక నెక్స్ట్ ఎన్నికల్లో అక్కడ టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా వరుసగా రెండుసార్లు గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతుంది…దీంతో బీజేపీకి అడ్వాంటేజ్ పెరుగుతుంది. ఇదే క్రమంలో ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా నిజామాబాద్ లో కమలం పార్టీ మెరుగైన ఫలితాలని సాధిస్తుందని తేలింది. ఇంతవరకు నిజామాబాద్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధించలేదు. అసలు ఇక్కడ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకున్న దాఖలాలు లేవు.కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం బీజేపీ మంచి ఫలితాలే రాబట్టేలా ఉంది. ఇప్పటికే వచ్చిన పలు సర్వేల్లో బీజేపీ కనీసం నాలుగు సీట్లు అయిన గెలుచుకుంటుందని తేలింది.

జిల్లాలో ప్రతి సీటులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో వీరిలో సగం మంది గెలిస్తే గొప్పే అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ స్థానాల్లో టీఆర్ఎస్ బలంగా ఉందని తెలుస్తోంది. ఇక నిజామాబాద్ అర్బన్, భోదన్, ఆర్మూర్ ల్లో బీజేపీ బలంగా ఉంది. అటు కామారెడ్డిలో కాంగ్రెస్ బలంగా కనిపిస్టోని. ఇక నిజామాబాద్ రూరల్, బాల్కొండ స్థానాల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నడిచేలా ఉంది. అయితే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ బలం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది…అదే జరిగితే…నిజామాబాద్ లో కమలం పైచేయి సాధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news