బీజేపీకి ఆ ఎంపీ సీట్లు..టీడీపీ త్యాగం చేస్తుందా?

-

ఎన్నికల సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొత్తులు సమీకరణాలు అతివేగంగా మారుతున్నాయి. టిడిపి + జనసేన, టిడిపి+ జనసేన+ బి‌జే‌పి కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిజెపితో పొత్తు కావాలనుకుంటే టీడీపీ తాము కచ్చితంగా గెలిచే కొన్ని ఎంపి స్థానాలను వదులుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

టిడిపి-జనసేన కలిసి రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసినా కూడా వారికి బిజెపి సపోర్టు కచ్చితంగా కావాల్సిందే.  రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా సాగాలన్న నిధులు సకాలంలో అందాలన్నా కేంద్రంలో టిడిపికి సపోర్టు ఉండాల్సిందే. కేంద్రంలో మరోసారి బి‌జే‌పినే అధికారంలోకి వచ్చేలా ఉంది. దీంతో బిజెపి సపోర్ట్ లేకుండా జగన్ వ్యూహాలను త్రిప్పి కొట్టాలంటే టిడిపి, జనసేనకు కష్టమైన పని అని చెప్పవచ్చు. జగన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే బిజెపితో పొత్తు తప్పనిసరి అలాంటప్పుడు బిజెపి కోరిన ఎంపీ స్థానాలను టిడిపి కచ్చితంగా త్యాగం చేయాల్సిందే.

ఆ ఎంపీ స్థానాలు కూడా టిడిపి లేదా జనసేన మంచి మెజారిటీతో గెలిచే స్థానాలని బిజెపి కోరుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవి విశాఖ, కాకినాడ, అమలాపురం, నరసాపురం, తిరుపతి లేదా రాజంపేట, నరసరావుపేట వీటిని కచ్చితంగా టిడిపి బిజెపి కోసం త్యాగం చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

కాకినాడ, అమలాపురం, నరసాపురం ఎంపీ స్థానాల్లో టి‌డి‌పితో పాటు జనసేనకు మంచి పట్టు ఉంది. కానీ పొత్తు పెట్టుకున్నట్లయితే ఆ ఎంపీ స్థానాలను తమకు ఇవ్వాలని బి‌జే‌పి అడుగుతున్నట్లు తెలిసింది. అలాగే పురందేశ్వరి విశాఖలో పోటీ చేయాలని చూస్తున్నారు. అప్పుడు విశాఖ కూడా బి‌జే‌పికి ఇవ్వాలి. అయితే విశాఖలో టిడిపి తరపున బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ గట్టి పట్టు సాధించుకున్నారు. అటు తిరుపతి లేదా రాజంపేట ఇవ్వాలని బిజెపి అడిగినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పొత్తు ఉంటే బి‌జే‌పికి ఈ ఎంపీ సీట్లు ఇస్తే టి‌డి‌పి ఓట్లు బదిలీ అయ్యే ఛాన్స్ ఉండదు. అప్పుడు టి‌డి‌పికే నష్టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version