సీట్లు దక్కని సీనియర్లతో అధికార బిఆర్‌ఎస్ పార్టీకి ఇబ్బందులు వస్తాయి. కొందరు పార్టీలు మారి..కొందరు పార్టీల్లోనే ఉంటూ..బిఆర్‌ఎస్ పార్టీకి డ్యామేజ్ చేస్తారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవువనే చెబుతున్నారు. కేసిఆర్ ఇప్పటికే అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించేశారు. ఈ క్రమంలో కొందరు సీనియర్లకు కేసిఆర్ సీట్లు ఇవ్వలేదు. వీరిలో కొందరిని బుజ్జగించే పార్టీలోనే ఉండేలా చేస్తున్నారు.
కానీ కొందరు వెనక్కి తగ్గడం లేదు.పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారు. అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించక ముందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు బిఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఎంత కాదు అనుకున్న వీరి వల్ల కాస్త బిఆర్‌ఎస్ ఓటు కోల్పోతుందనే చెప్పాలి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరావు లాంటి సీనియర్ పార్టీ మారడానికి రెడీ అయ్యారు. మామూలుగానే ఖమ్మంలో బిఆర్‌ఎస్ పరిస్తితి అంతంత మాత్రమే..పైగా 2014 తర్వాత తుమ్మల, పొంగులేటి లాంటి వారు బిఆర్‌ఎస్ లోకి రావడం వల్ల 2018 ఎన్నికల్లో ఓటు బ్యాంక్ భారీగా పెరిగింది. ఇప్పుడు ఆ ఇద్దరు వెళితే దారుణంగా ఓటు బ్యాంక్ కోల్పోతుంది.
ఇటు బిఆర్‌ఎస్ లో ఉంటూనే కొందరు సీనియర్లు..తమ స్థానాల్లో బిఆర్‌ఎస్ అభ్యర్ధులకు సహకరించే అవకాశాలు తక్కువ ఉన్నాయి. పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, రాజయ్య, చెన్నమనేని రమేష్, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు…ఇలా చూసుకుంటే కొందరు సీనియర్లు బిఆర్‌ఎస్ లోనే ఉన్నా..పైకి సహకరిస్తున్నట్లు కనిపించిన..పరోక్షంగా సహకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
తమ నేతలకు సీటు రానప్పుడు..వేరే వాళ్ళకు ఓటు వేయడం ఎందుకని ఆలోచించే ఛాన్స్ ఉంది. అలా కాకుండా కేసిఆర్‌ని చూసి ఓటు వేస్తే ఇబ్బందులు ఉండవు. మొత్తానికైతే ఈ సీనియర్ల వల్ల బిఆర్‌ఎస్ ఓటు బ్యాంకుకు కాస్త నష్టం మాత్రం జరిగే ఛాన్స్ ఉంది.