ఓరుగల్లులో ‘కారు’కు నో బ్రేకులు..ఆపడం కష్టమేనా?

-

ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి వరంగల్ కారుకు కంచుకోట అయింది. ఇక 2014, 2018 ఎన్నికల్లో వరంగల్ లో కారు హవా నడిచింది. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలో గులాబీ పార్టీ జోరు ఎక్కువ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పరిధిలో ఉన్న స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట స్థానాలని బి‌ఆర్‌ఎస్ గెలుచుకుంది. ఒక్క భూపాలపల్లి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.

అయితే తర్వాత భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళిపోయారు. దీంతో మొత్తం బి‌ఆర్‌ఎస్ చేతుల్లోకి వెళ్లింది. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వరంగల్ బి‌ఆర్‌ఎస్ కైవసం అయింది. 7 అసెంబ్లీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యం నడిచింది.  ఎంపీ స్థానాన్ని 3.50 లక్షల ఓట్ల మెజారిటీతో బి‌ఆర్‌ఎస్ దక్కించుకుంది. అంటే వరంగల్ పార్లమెంట్ స్థానం బి‌ఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది.

 

 

ఈ సారి ఎన్నికల్లో కూడా వరంగల్ పార్లమెంట్ పరిధిలో బి‌ఆర్‌ఎస్ హవా నడిచేలా ఉంది. దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ హవా కనిపిస్తోంది. కొద్దో గొప్ప పరకాల, వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి స్థానాల్లోనే కాస్త పార్టీ డౌన్ లో కన్పిస్తుంది. మిగిలిన నాలుగు స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ హవా ఉంది. అయితే పరకాల, వరంగల్ ఈస్ట్ స్థానాల్లో కొండా సురేఖ ఫ్యామిలీ డామినేషన్ ఉంది. కాంగ్రెస్ నుంచి కొండా ఫ్యామిలీ పోటీకి రెడీ అవుతుంది.

అటు భూపాలపల్లిలో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణకు కాస్త పాజిటివ్ ఉంది. గత ఎన్నికల్లోనే ఇండిపెండెంట్ గా పోటీ చేసి 54 వేల ఓట్లు వరకు తెచ్చుకున్నారు. ఇపుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. ఈ సారి భూపాలపల్లిలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వనున్నారు. మొత్తానికైతే వరంగల్ లో బి‌ఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యం కనిపిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news