తెలంగాణలో రాజకీయ హీట్ రాను రాను పెరుగుతుంది…ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అన్నీ పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బిఆర్‌ఎస్-బిజేపి-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. అయితే బిఆర్‌ఎస్-బిజేపిల మధ్య తీవ్రమైన పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే తగలబడేలా పరిస్తితి ఉంది.
ఇలాంటి తరుణంలో ఒకే వేదికపై రెండు పార్టీలు సభలు నిర్వహించనున్నాయి. మూడు రోజుల గ్యాప్ తో రెండు పార్టీల సభలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్నాయి. ఫిబ్రవరి 13న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న విషయం తెలిసిందే. పలు రైల్వే అభివృద్ధి పనులని ప్రారంభించిన అనంతరం మోదీ..పరేడ్ గ్రౌండ్ లో పార్టీ ఆధ్వర్యంలో జరిగే సభలో పాల్గొనున్నారు. మునుపటి కంటే భారీ స్థాయిలో సభన సక్సెస్ చేయాలని బిజేపి ట్రై చేస్తుంది. భారీగా జనాలని సమీకరించాలని చూస్తున్నారు.
ఇక ఫిబ్రవరి 17న బిఆర్‌ఎస్ సభ అదే గ్రౌండ్ లో జరగనుంది. బిజేపి కంటే భారీగా సభ నిర్వహించాలని చెప్పి బిఆర్‌ఎస్ ప్లాన్ చేస్తుంది. ఫిబ్రవరి 17న కేసిఆర్..సచివాలయంని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే..తర్వాత పరేడ్ గ్రౌండ్ లో భారీ సభకు ప్లాన్ చేశారు. సచివాలయం ప్రారంభోత్సవానికి పలువురు జాతీయ నేతలు సైతం హాజరవుతున్న విషయం తెలిసిందే.
ఇక మోదీ సర్కార్ టార్గెట్ గా ఈ సభ జరగనుండటం…జాతీయ రాజకీయాలని ఆకర్షిచేలా రాజకీయం జరగనున్న నేపథ్యంలో బిజేపి కంటే భారీగా జనాలని సమీకరించి సభని సక్సెస్ చేయాలని బిఆర్‌ఎస్ ప్లాన్ చేస్తుంది. అంటే రెండు పార్టీలు ఒకరిని మించి ఒకరు భారీ స్థాయిలో పరేడ్ లో సభ నిర్వహించాలని చూస్తున్నారు. మరి ఈ విషయంలో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.