కల్యాణ్ ‘బాబు’ ‘కమ్మ’ని రాజకీయం.. కొడాలితో రివర్స్ అవుతుందా?

ఏపీ రాజకీయాలు కులాల పాత్ర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు కులాల బట్టే రాజకీయాలు నడుస్తుంటాయి…కులాల ఆధారంగానే నాయకులు రాజకీయాలు చేస్తారు. ఏపీలో ఇప్పుడు కమ్మ, కాపు, రెడ్డి వర్గాల మధ్యే ప్రధానంగా రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ‘కమ్మ’ని రాజకీయం బాగా నడుస్తోంది. మొదట నుంచి తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే విషయం తెలిసిందే.

Kodali-Nani

జగన్ అధికారంలోకి వచ్చాక కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని టి‌డి‌పి ఆరోపిస్తూనే ఉంది. ఇక కమ్మ వర్గం టార్గెట్‌గా ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయో జనాలకు బాగా తెలుసు. అయితే ఇలా కమ్మ వర్గం టార్గెట్‌గా రాజకీయం కరెక్ట్ కాదని పవన్ కల్యాణ్ ఆ మధ్య మాట్లాడారు. కమ్మ వర్గానికి తాను అండగా ఉంటానని చెప్పారు.

అయితే అదే విషయంపై మంత్రి కొడాలి నాని తాజాగా మాట్లాడుతూ…. కమ్మ వర్గం ఎవరైనా సరే జగన్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని పవన్‌కు చెప్పారా? అని ప్రశ్నించారు. ఒకవేళ చంద్రబాబు… తనని ఆదుకోమని పవన్‌ని కోరి ఉంటారని. .అందుకే పవన్… కమ్మ వర్గానికి అండగా ఉంటానని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు సొంత పుత్రుడు మీద నమ్మకం లేక దత్తపుత్రుడుతో రాజకీయాలు చేయిస్తున్నారని, చంద్రబాబును అధికారంలోకి తేవటమే పవన్ లక్ష్యమని, బాబు చేతిలో పవన్ గంగిరెద్దు అని, ఇద్దరు కలిసి ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ని ఓడించలేరని, జీవితాంతం జగనే సి‌ఎం అని కొడాలి మాట్లాడారు.

అయితే కమ్మ వర్గం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం నడిచిన సరే… పవన్ ప్రత్యేకంగా కమ్మ వర్గానికి అండగా ఉంటానని మాట్లాడటంతో డౌట్ మొదలైంది… బాబుతో పవన్ కలిసి పనిచేయనున్నారని క్లారిటీ వచ్చేసింది. ఇదే సమయంలో కొడాలి లాజికల్‌గా మాట్లాడుతున్నారు… బాబు-పవన్‌లు కుట్రలు చేస్తున్నారని, ఇద్దరు కలిసి జగన్ మీదకు వస్తున్నారనే విధంగా మాట్లాడుతూ… జనంలో జగన్ మీద ఇంకా సింపతీ క్రియేట్ చేసేలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి బాబు-పవన్ కమ్మని రాజకీయం రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది.