బాబు మేనిఫెస్టో ఫేజ్-1..సంక్షేమంలో జగన్‌ని దాటగలరా.!

-

ఈ సారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. జగన్‌ని గద్దె దించి అధికారం సొంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే సంక్షేమంతో దూసుకెళుతున్న జగన్‌ని గద్దె దించడం అనేది సాధ్యమైన పని కాదు. సంక్షేమంతో..చాలామంది ప్రజలు జగన్ వైపే ఉన్నారు. వారిని టి‌డి‌పికి వైపుకు తిప్పాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బాబు..మేనిఫెస్టో రెడీ చేస్తున్నారు. ఈ సారి ఊహించని విధంగా సంక్షేమం రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.

మహానాడులో అదే విధంగా బాబు ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు నవ్ ఆర్ నెవర్ అంటూ సంక్షేమం గురించి చెబుతూనే..దేశంలోనే ధనిక సీఎం జగన్ అయితే..పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్లను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని, పీ 4 విధానం ద్వారా పేదలను ధనికులను చేసే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇక మహానాడు రెండో రోజు అంటే మే 28న పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తొలి ఫేజ్ విడుదల చేస్తామని, అభివృద్ధి తో పాటుగా అదిరిపోయే సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. పార్టీని క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికారిక సారధులతో బలోపేతం చేసామని, ప్రతీ కార్యకర్త ప్రజలు..పేదలతో మమేకం అవ్వాలని, 2024 ఎన్నికలే టార్గెట్ గా పని చేయాలని నిర్దేశించారు.

అయితే మేనిఫెస్టో ఫేజ్ 1 అంటూ బాబు ప్రకటన చేయడంతో..ఆయన మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇస్తారు..అవి ప్రజలని ఏ విధంగా ఆకర్షిస్తాయి..వైసీపీకి ఎలా చెక్ పెడతాయనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news