పోలిటికల్ ట్విస్ట్: బాబు భలే ప్లాన్?

-

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఏపీలో ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి…నెక్స్ట్ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఇటు వైసీపీ, అటు టీడీపీలు కూడా రాజకీయం చేస్తున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర పైనే సమయం ఉండగానే…ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో రాజకీయం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం…ఎప్పటికప్పుడు వ్యూహం మారుస్తూ రాజకీయం నడిపిస్తున్నారు…నెక్స్ట్ అధికారం దక్కించుకోవడం బాబుకు చాలా ముఖ్యం.

అందుకే ఇప్పటినుంచే బాబు తెగ కష్టపడుతున్నారు…ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు…ఎప్పటికప్పుడు సరికొత్త స్కెచ్ లతో రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీని ఇరికించడానికి బాబు పలు కార్యక్రమాలు చేశారు…ఈ మధ్య పెరిగిన ధరలకు నిరసనగా బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీకి మైలేజ్ పెంచే మరో కార్యక్రమాన్ని చంద్రబాబు నిదానంగా మొదలుపెడుతున్నారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల మన్ననలు పొందిన కార్యక్రమాల్లో…అన్నా క్యాంటీన్ల ద్వారా…పేద ప్రజలకు రూ.5 లకే భోజనం పెట్టడం. ఉదయాన టిఫిన్…మధ్యాహ్నం, సాయంత్రం భోజనం పెట్టే కార్యక్రమం చేశారు. ఈ అన్నా క్యాంటీన్లకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక క్యాంటీన్లని మూసివేశారు. ఈ అంశంపై ప్రజలు జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగానే ఉన్నారు. ఈ అసంతృప్తిని టీడీపీ క్యాష్ చేసుకునే పనిలో పడింది.. నిదానంగా సొంత ఖర్చుతో టీడీపీ నేతలు ఎక్కడకక్కడ అన్నా క్యాంటీన్లు ప్రారంభించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల క్యాంటీన్లని ఓపెన్ చేసి పేదలకు భోజనం అందిస్తున్నారు. ఈ క్యాంటీన్లకు పెద్ద స్పందన వస్తుంది.

అందుకే మరింత ఎక్కువగా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని బాబు…టీడీపీ నేతలకు సూచనలు చేస్తున్నారు. అయితే జగన్ క్లోజ్ చేశాక..వాటిని ఓపెన్ చేయొచ్చు…కానీ అప్పటినుంచి అయితే ఆర్ధికంగా భారం పడుతుందని చెప్పి…కరెక్ట్ గా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే క్యాంటీన్లు మొదలుపెడుతున్నారు. మొత్తానికి ఈ క్యాంటీన్లు టీడీపీకి ప్లస్ అయ్యేలాగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news