స్టేట్ నామినెటెడ్ పదవుల భర్తీలో చంద్రబాబు ట్విస్ట్.. బిజేపీ షాక్..

-

ఏపీలో నామినెటెడ్ పదవులు అందరినీ ఊరిస్తున్నాయి.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేపో ఎల్లుండో భర్తీ ఉంటుందని అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు.. కానీ జనసేన, బిజేపీకి ఇవ్వాల్సిన వాటాలో తేడా రావడంతో చంద్రబాబు ఆ ఆలోచనను కొద్దిరోజులు పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది.. తాజాగా బిజేపీ విషయంలో ఆయన ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది..

ఏపీ నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి ఇచ్చే వాటాకు తగ్గట్లుగా కేంద్ర నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ , జనసేన నేతలకు కూడా చాన్సివ్వాలని చంద్రబాబు పట్టుబడుతున్నట్లుగా పార్టీలో చర్చ నడుస్తోంది.. నామినేటెడ్ పదవుల భర్తీ కి జాబితాను చంద్రబాబు సిద్దం చేశారు. అయితే బీజేపీ మాత్రం..తమకు ఎక్కువ కావాలని పట్టుబడుతోంది.. పైగా తమ పార్టీలో ఉండే సీనియర్ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డిలాంటి వాళ్లకి ప్రాధాన్యత కల్గిన పోస్టులు ఇవ్వాలని కోరుతోంది.. కేంద్ర పెద్దల నుంచి చంద్రబాబుకు పోన్లు కూడా చేయిస్తున్నారట..

బిజేపీ ఛీప్ పురందేశ్వరీ బేటీ అనంతరం చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.. కేంద్రంలో భర్తీ చేసే నామినెటెడ్ పదవుల్లో తమకు వాటా ఇవ్వాలని ఆయన కోరారట.. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించడంతో.. మరో కొద్దిరోజులు తర్వాత ఏపీలో నామినెటెడ్ పదవులు భర్తీ చేద్దామనే ఆలోచనలో బాబు ఉన్నారని ఎన్టీయార్ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version