బాబుకు…కల్యాణ్ బాబు హ్యాండ్ ఇచ్చేసినట్లేనా!

-

మొన్నటివరకు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌లు కలిసి రాజకీయం చేయనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచిన విషయం తెలిసిందే. అసలు టి‌డి‌పి-జనసేనలు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైపోయాయని ప్రచారం వచ్చింది. అందుకు తగ్గట్టుగా కొన్ని ఘటనలు…వారి స్నేహానికి ఉదాహరణలుగా నిలిచాయి. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేనలు కలిసి వైసీపీకి చెక్ పెట్టడం…తర్వాత పవన్-వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు టి‌డి‌పి…పవన్‌కు సపోర్ట్‌గా నిలిచింది.

ఇక ఇప్పుడు వైసీపీ శ్రేణులు…టి‌డి‌పి ఆఫీసులపై దాడులు జరగడాన్ని పవన్ ఖండించారు. ఈ పరిణామాలని చూస్తుంటే బాబు, కల్యాణ్ బాబులు కలిసి రాజకీయం చేయబోతున్నారనే అర్ధమవుతుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందని తెలుస్తోంది…పవన్‌తో కలిసి నడవటానికి చంద్రబాబు రెడీగానే ఉన్నారు. అందుకే పవన్ కల్యాణ్ సపోర్ట్ కావాలని బాబు, బహిరంగంగానే చెబుతున్నారు. కానీ పవన్ నుంచి అలాంటి మాటలు రావడం లేదు.

తాజాగా చంద్రబాబు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్‌కు పవన్ మద్ధతు ఉంటుందని, అప్పుడు టి‌డి‌పి శ్రేణులకు, జనసేన శ్రేణులు కలిస్తే బంద్ సక్సెస్ అయిపోతుందని, వైసీపీకి చెక్ పెట్టినట్లు ఉంటుందని బాబు భావించారు. కానీ అది పూర్తిగా రివర్స్ అయింది…అసలు బంద్ విషయంలో పవన్ సపోర్ట్ ఇవ్వలేదు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయం కాబట్టే, పవన్ జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది.

పైగా టి‌డి‌పితో ఇప్పుడే కలవాలని పవన్ అనుకుంటున్నట్లు లేరు. ఎందుకంటే పవన్ సొంతంగా ఎదగాలి…జనసేనని బాగా బలోపేతం చేయాలి. ఇప్పుడు ఎలాగో బి‌జే‌పికి కాస్త దూరం జరిగారు…ఇలాంటి పరిస్తితుల్లో టి‌డి‌పికి దగ్గరయ్యి, సొంతంగా ఎదిగే అవకాశాలని వదులుకోవాలని పవన్ అనుకుంటున్నట్లు లేరు. ఎలాగో ఎన్నికలకు రెండున్నర ఏళ్ళు సమయం ఉంది.. ఈలోపు పార్టీని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ పరిస్తితులని బట్టి చంద్రబాబుకు సపోర్ట్ ఇవ్వడమా…లేక హ్యాండ్ ఇచ్చి సొంతంగా పోటీ చేయాలా? అనేది పవన్ అప్పుడే ఆలోచించే అవకాశం ఉంది. ఈలోపు బాబుకు కల్యాణ్ బాబు సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news