చంద్ర‌బాబు స్కామ్ నెక్ట్స్ లెవ‌ల్.. కోడ్ లాంగ్వేజ్ తో కోట్లు హాంఫ‌ట్..

-

సిన్సియ‌ర్ పొలిటీషియ‌న్ అని చెప్పుకునే చంద్ర‌బాబు, నిప్పు అని చాటింపు వేసుకునే చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డ్డారు. అమరావతి రాజ‌ధాని నిర్మాణాలకు సంబంధించిన స్కాంలో చంద్రబాబు రూ. 118 కోట్ల ముడుపులు అందుకున్నారని ఐటీ శాఖ తాఖీదులు ఇవ్వ‌డంతో ఆయ‌న ఎలాంటి కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ‌తాడో తేలిపోయింది. సాక్ష్యాధారాల‌తో ఐటీ అధికారులు బ‌హిర్గ‌తం చేయ‌డంతో తేలు కుట్టిన దొంగ‌లా మౌనంగా ఉంటున్నారే త‌ప్ప నోరు మెద‌ప‌డం లేదు. ఈ స్కామ్ కూడా అత్యంత ప‌క‌డ్బందీగా చేసిన‌ట్లు తాజాగా వెల్ల‌డైంది. మాఫియా చూసుంటారు.. హ‌వాలా చూసుకుంటారు.. స్మ‌గ్లింగ్ చూసుంటారు.. కానీ ఇలాంటి స్కామ్ మాత్రం సినిమాల్లో కూడా చూసుండ‌రు. ఎందుకంటే చంద్ర‌బాబు అండ్ టీమ్ కోడింగ్ లాంగ్వేజ్ చేసిన స్కామ్ మొత్తం నెక్ట్స్ లెవ‌ల్.

ఇంత‌కీ ఈ కోడ్ లాంగ్వేజ్ ఏంట‌నే క‌దా ? స్టీల్, ట‌న్ను, విజ‌య్, విష్ ఇలాంటివి కోడ్ భాష‌కు వినియోగించిన ప‌దాలు. స్టీల్ అంటే క్యాష్, ట‌న్ను అంటే కోటి, విజ‌య్ అంటే విజ‌య‌వాడ‌, విష్ అంటే విశాఖ‌. అంటే ట‌న్నుల కొద్ది క్యాష్ ను విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంకి త‌ర‌లించార‌ని అర్ధం. ఈ లాంగ్వేజ్ లోనే వివిధ ప్రాంతాల్లో అకౌంట్ల‌లో కోట్ల‌కొద్దీ డ‌బ్బును చేర‌వేశారు. ఇది చంద్ర‌బాబు మార్క్ స్కామ్. ఎవ‌రు దీన్ని చూసినా అర్ధం కాదు. కానీ ఐటీ అధికారులు విచార‌ణ‌లో ఈ కోడ్ లాంగ్వేజ్ గుట్టును ర‌ట్టు చేశారు. దీంతో బాబు స‌రికొత్త మ‌నీ మాఫియాకు తెర తీశార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అమ‌రావ‌తి నిర్మాణంతో పాటు ఇత‌ర నిర్మాణాలతో క‌లిసి షాపూర్జీ పల్లోంజీ కంపెనీ వివిధ ప్రాంతాల్లో వేల కోట్ల కాంట్రాక్ట్ ప‌నులు చేప‌ట్టింది. ఆ యా నిర్మాణాల అనుమ‌తుల‌కు గానూ, చంద్ర‌బాబు అండ్ టీమ్ క‌మీష‌న్ల రూపేణా కోట్లు దండుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలన్నీ షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ కోడ్‌ భాషలో తన ఈ మెయిల్‌ ఐడీకే మెయిల్‌ చేసుకుని భద్ర పరిచినట్టుగా గుర్తించారు. ఎవరెవరికి ఎంతెంత మొత్తం చెల్లించింది కోడ్‌ భాష స్టీల్, టన్నుల రూపంలో పేర్కొన్నట్టుగా పూర్తి వివరాలను న‌మోదు చేసుకున్నారు. హైదరాబాద్‌కు 3 టన్నులు, ఢిల్లీకి 3 టన్నులు, ముంబాయికి 3.5 టన్నులు.. ఇలా భారీగా నిధులను మళ్లించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సదరు కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్ గా పని చేస్తున్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ కు మధ్య నడిచిన చాట్ సంభాషణ, డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ తదితర ఆధారాలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వీటితో పాటు ఆయా కంపెనీల ప్రతినిధుల నుంచి వాంగ్మూలంగా తీసుకుని ఐటీ అప్రైజల్‌ రిపోర్ట్‌ తయారు చేశారు. దాన్ని చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు చూపించారు. అదంతా వాస్తవమేనని శ్రీనివాస్‌ అంగీకరించి సంతకాలు కూడా చేశారు. శ్రీనివాస్‌తో పాటు ఈ స్కామ్‌లో మిగిలిన వారిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు. వాళ్లు కూడా అదంతా వాస్తవమేనని అంగీకరించి సంతకాలు కూడా చేశారని ఐటీ అప్రైజల్‌ రిపోర్ట్‌‌లో తేలిందని పేర్కొన్నారు. ఆధారాల‌తో స‌హా చంద్ర‌బాబు నిందితుడిని పేర్కొంటూ ఆయ‌న‌కు నోటీసుల‌ను అంద‌చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

ఇప్పుడు ఈ భారీ స్కామ్‌లో చంద్ర‌బాబు స్పందించాల్సి వుంది. గ‌తంలో 2022, సెప్టెంబర్ 22వ తేదీనే మొదటిసారి చంద్రబాబుకు ఐటీ శాఖ ఇదే విషయమై నోటీసిచ్చింది. అందులో చంద్రబాబుకు ముడుపులు అందినట్లుగా తమకు దొరికిన ఆధారాలను కూడా ఐటీ శాఖ వివరించింది. దీనిపై సమాధానం చెప్పమని నోటీసులో కోరినా, చంద్ర‌బాబు రివ‌ర్స్ ఎటాక్ చేశారు. తనకు నోటీసిచ్చిన ఐటీ శాఖ పరిధిలోకి తాను రానని అడ్డం తిరిగారు. కానీ ఇప్పుడు మాత్రం స‌మాధానం ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే కాంట్రాక్టు సంస్థ‌ యజమాని మనోజ్ వాసుదేవ్ పర్ధాసాని నుంచి 118 కోట్ల రూపాయలను చంద్రబాబు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ అందుకున్నట్లు ఐటీ వ‌ద్ద ఖ‌చ్చిత‌మైన ఆధారాలున్నాయి. మొత్తానికి చంద్ర‌బాబు కోడ్ లాంగ్వేజ్ మ‌నీ మాఫియా, ఆయ‌న క్రిమిన‌ల్ మైండ్ కి ప‌రాకాష్ట‌గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version