తెలంగాణ అనేక విషయాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలో తొలిస్థానంలో ఉందని.. జీఎస్డీపీలో తెలంగాణ ముందు వరసలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎన్నో నిందలు వేశారని.. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని ఆయన అన్నారు. తెలంగాణ అంటే చాలా ఈర్ష్య పడుతున్నారని.. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ కన్నా తెలంగాణ ముందు ఉందని ఆయన అన్నారు. ఒకప్పుడు మనకు కరెంట్ ఉండేది కాదని… ఎప్పుడు వస్తుందో తెలియదని అలాంటిది ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ గా తెలంగాణ ఉందని కేసీఆర్ అన్నారు. ప్రతీ ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కష్టపడటంతోనే.. తెలంగాణ డెవలప్మెంట్ సాధ్యం అయిందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ రంగంలో విద్య కూడా మంచిగా జరగాలని..‘‘ మనఊరు – మనబడి’’ రూ. 10 వేల కోట్లతో ప్రారంభించామని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ దేశంలో నంబర్ వన్ పొజీషన్ లో ఉంది: సీఎం కేసీఆర్
-