ఆదర్శంగా నిలుస్తున్న సీఎం యోగి

-

వినూత్న ఆలోచనలు,ప్రజామోద పాలనతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. అటు కేంద్రంలోని మంత్రులు కూడా యోగి ప్రభుత్వాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మరో ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్న యోగి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలి అన్నపూర్ణ దుకాణాన్ని జులై 13న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నపూర్ణ దుకాణం గురించి తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇలాంటి దుకాణాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

అన్నపూర్ణ దుకాణ అంటే ఒకవిధంగా రేషన్ షాప్ లాంటిదే.అయితే అక్కడ కొన్ని సరుకులు మాత్రమే దొరుకుతాయి.కానీ అన్నపూర్ణ దుకాణంలో అన్ని రకాల వస్తువులు,ధాన్యాలను సరసమైన ధరలతో వినియోగదారులకు అందిస్తారు. అన్నపూర్ణ నుంచి ఆహార ధాన్యాలను సులభంగా డెలివరీ చేయడం మరియు వినియోగదారుల సౌకర్యాన్ని పెంచడమే ఈ దుకాణాల లక్ష్యం. సామాన్యులు సైతం ఇక్కడి వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. మరో విశేషమేమిటంటే ఉపాధి హామీ పథకం కింద ఈ దుకాణాలను నిర్మిస్తున్నారు.

అటు పేదలకు కూడా వీటి వలన ఉపాధి దొరుకుతుంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సౌమ్య అగర్వాల్ గత మే నెలలో ఈ స్కీమ్‌ని డిజైన్‌ చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగా ఆమెను అభినందిస్తూ వెంటనే ఆమోదించారు. ఈ పథకాన్ని మెచ్చుకున్న సీఎం యోగీ దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని కేంద్రాన్ని కూడా కోరారు.

అన్నపూర్ణ దుకాణాల్లో రేషన్‌తో పాటు, రేషన్ కార్డ్ హోల్డర్‌లు పబ్లిక్ సర్వీస్ సెంటర్‌లో విద్యుత్ బిల్లు చెల్లింపు, PM వాణి కింద బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం మరియు కిరాణా వస్తువులను పొందుతారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద మొట్టమొదటి దుకాణ్‌ ఏర్పాటు చేస్తున్న యోగీ సర్కారు ఖచ్చితంగా ఈ స్కీమ్‌ ప్రజల ఆదరణ పొందుతుందని ఆశాభావం తో ఉన్నారు. అందుకే వివిధ జిల్లాల్లో మొదటి దశలో 75 అన్నపూర్ణ దుకాణాలను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టారు.ఈ స్కీమ్‌ని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ కూడా అభినందించారు.ఇలాంటి దేశవ్యాప్తంగా తీసుకొస్తూ ప్రజలు సరసమైన ధరలకే ఆహార పదార్ధాలు కొనుక్కునే సౌలభ్యం ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version