టీఆర్ఎస్‌కు సీపీఎం మద్ధతు..కానీ ట్విస్ట్?

-

ఎట్టకేలకు మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్ధతు దక్కింది. మామూలుగా కమ్యూనిస్టులని దూరం పెట్టే కేసీఆర్…మునుగోడు ఉపఎన్నికలో మాత్రం కమ్యూనిస్టుల మద్ధతు కోరుకున్నారు. ఎందుకంటే మునుగోడులో కమ్యూనిస్టులకు బలం ఎక్కువ కాబట్టి..గతంలో సి‌పి‌ఐ పార్టీ మునుగోడులో అయిదుసార్లు గెలిచింది. కాకపోతే ఏదొక పార్టీ పొత్తుతోనే సి‌పి‌ఐ మునుగోడులో గెలుస్తూ వచ్చింది.

అంటే పూర్తి స్థాయిలో గెలిచే బలం సి‌పి‌ఐకి లేదు…కానీ గెలుపోటములని తారుమారు చేసే బలం మాత్రం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. అసలే బీజేపీ పుంజుకుంటుంది..పైగా కోమటిరెడ్డి లాంటి బలమైన నేత ఉన్నారు. దీంతో మునుగోడులో గెలుపు అంత ఈజీ కాదని కేసీఆర్ భావించారు.

అసలే బీజేపీ చేతిలో రెండుసార్లు దెబ్బతిన్నారు. అందుకే ఈ సారి రిస్క్ ఎందుకని సి‌పి‌ఐ మద్ధతు తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ వీక్ కావడంతో..సి‌పి‌ఐ..టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇచ్చింది. అలాగే తమ పొత్తు కంటిన్యూ అవుతుందని సి‌పి‌ఐ ప్రకటించింది. అటు కేసీఆర్ కూడా అదే మాట చెప్పారు.

ఇక మునుగోడులో 5 వేల పైనే ఓట్లు ఉన్న సి‌పి‌ఎం కూడా..తాజాగా టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ప్రకటించింది. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది…సి‌పి‌ఐ మాదిరిగా…రానున్న కాలంలో టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని చెప్పలేదు. మునుగోడు వరకే మద్ధతు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

మునుగోడులో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉంటే వాళ్ళకే మద్దతిచ్చేవాళ్ళమని, అయితే కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని, రేపు కూడా కేసీఆర్ తమని తోక పార్టీ అని విమర్శించవచ్చని, అందుకే తమ మద్దతు కేవలం మునుగోడు వరకే అని స్పష్టం చేశారు. అయితే ఇలా కేసీఆర్‌కు డౌట్ డౌట్‌గా మద్ధతు ఇవ్వడం వల్ల మునుగోడులో సి‌పి‌ఎం మద్ధతుదారులు ఎంతవరకు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news