అధికార టీఆర్ఎస్‌లో రెండోసారి ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వారిపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే…వరుసగా 2014, 2018 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అయినవారికి ఈ సారి ఎన్నికల్లో గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని పీకే టీం సర్వేలో కూడా తేలింది..అలాగా కొందరికి సీట్లు ఇచ్చే అవకాశం కూడా లేదని తెలిసింది. అయితే ఇలా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇబ్బందులు ఎదురుకుంటున్న వారిలో రసమయి బాలకృష్ణన్ కూడా ఉన్నారు.
గాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రసమయికి..కేసీఆర్ 2014లో మానకొండూరు సీటు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి రావడంతో అప్పుడు రసమయి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఇదే ఊపుతో 2018 ఎన్నికల్లో కూడా గెలిచేశారు. కాకపోతే ఈ సారి మెజారిటీ చాలా వరకు తగ్గింది.
2014లో దాదాపు 45 వేల ఓట్లు పైనే మెజారిటీతో గెలిచిన రసమయి 2018 ఎన్నికల్లో 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇలా రెండోసారి ఎమ్మెల్యే అయిన రసమయి…నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో మాత్రం అందుబాటులో ఉంటున్నట్లు కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు సుడిగాలి పర్యటనలు చేసి వెళ్లిపోతున్నారు..అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు కనిపిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో రసమయిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.
ఇదే సమయంలో మాన కొండూరు టీఆర్ఎస్‌లో గ్రూపు తగాదాలు ఉన్నాయి..రసమయికి వ్యతిరేకంగా ఆరేపల్లి మోహన్, ఓరుగంటి ఆనంద్ రాజకీయం చేస్తున్నారు..2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మోహన్..2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయి, తర్వాత టీఆర్ఎస్‌లోకి వచ్చారు. ఈయకంటూ సెపరేట్ ఫాలోయింగ్ ఉంది…అలాగే సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు…పైగా నెక్స్ట్ సీటు కోసం ట్రై చేస్తున్నారు. అటు ఆనంద్ సైతం సీటు కోసం ట్రై చేస్తున్నారు..2009లో ఈయనే టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. తర్వాత రసమయి రావడంతో సీటు పోయింది. ఈ సారి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. దీంతో రసమయికి సొంత పోరు పెరిగింది. నెక్స్ట్ రసమయికి సీటు డౌట్ అనే పరిస్తితి…ఒకవేళ సీటు దక్కిన..గెలుపుకు మిగిలిన వారు సహకరించడం కష్టం. ఏదేమైనా మానకొండూరులో రసమయికి కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి.