బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుని మాజీ మంత్రి డీకే అరుణ బిజేపిలోకి ఆహ్వానించారు. తజజ జూపల్లికి..డీకే ఫోన్ చేసినట్లు తెలిసింది. బీజేపీలోకి రావాలని, కలిసి పనిచేద్దామని సూచించినట్లు తెలిసింది. అయితే కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని జూపల్లి చెప్పినట్లు తెలిసిందే. అయితే ఎప్పటినుంచి అరుణ-జూపల్లి మధ్య రాజకీయ శతృత్వం ఉన్న విషయం తెలిసిందే.
గతంలో వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విషయం తెలిసిందే. అప్పుడే వీరికి పడేది కాదు..ఇద్దరు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నేతలే. జూపల్లి కొల్లాపూర్ లో గెలిస్తే..అరుణ గద్వాల్ లో గెలిచేవారు. ఇక ఇద్దరు జిల్లాపై పట్టు సాధించేందుకు చూసేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. కాకపోతే కాస్త అరుణ హవా నడిచేది..దీంతో జూపల్లి అసంతృప్తితో ఉండేవారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం కూడా ఉంది..దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి, పదవికి రాజీనామా చేసి బిఆర్‌ఎస్ లో చేరిపోయారు. దీంతో 2012లో ఉపఎన్నిక వస్తే పోటీ చేసి గెలిచారు.
ఇక 2014లో బిఆర్‌ఎస్ నుంచి కొల్లాపూర్ లో పోటీ చేసి గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనపై కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని బిఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు. అక్కడ నుంచి జూపల్లికి ప్రాధాన్యత లేకుండా పోయింది. నెక్స్ట్ కూడా సీటు గ్యారెంటీ లేదు. ఈ క్రమంలో బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జూపల్లి జతకట్టారు. దీంతో ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ ఇద్దరి కోసం బిజేపి, కాంగ్రెస్ పార్టీలు ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అరుణ..జూపల్లితో మాట్లాడినట్లు తెలిసింది. మరి పాత శతృత్వం వదిలేసి..జూపల్లి బిజేపిలోకి వెళ్తారో లేదో చూడాలి.