సర్వే లీక్..తూర్పులో లీడ్ ఆ పార్టీకే?

-

ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఊహించని విధంగా సర్వేలు లీక్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు తమ సొంత సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇటు ప్రైవేట్ సంస్థలు సైతం సెపరేట్ గా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఆత్మసాక్షి అనే సంస్థ సర్వేలు చేస్తుంది. ఆ సర్వేలు సైతం బయటకొస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఐప్యాక్ సంస్థ సర్వే లీక్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ సర్వేలో 25 మంత్రుల్లో కేవలం 5 గురు మంత్రులు మాత్రమే లీడ్ లో ఉన్నారని తేలింది. అటు వైసీపీలోని మాజీ మంత్రుల్లో కేలవం ఇద్దరు లీడ్ లో ఉన్నారని తేలింది. మరి ఈ సర్వేలో నిజముందో తెలియదు గాని..అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ చానల్ పేరిట ఓ సర్వే లీక్ అయిందని ప్రచారం మొదలైంది..అది కూడా తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని స్థానాలకు సంబంధించిన సర్వే..పైగా వైసీపీ-టీడీపీలకు సంబంధించే మాత్రమే రిపోర్ట్ వచ్చింది. జనసేనకు ఎంత శాతం ఓట్లు వస్తాయనేది చెప్పలేదు.

ఆ సర్వే ప్రకారం..అమలాపురం, అనపర్తి, పి.గన్నవరం, రాజానగరం, పిఠాపురం స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉండగా..కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, పెద్దాపురం, ముమ్మిడివరం, ప్రత్తిపాడు సీట్లలో టీడీపీకి లీడ్ ఉంది. అలాగే కాకినాడ రూరల్, కొత్తపేట, జగ్గంపేట సీట్లలో టీడీపీ-వైసీపీ పోటాపోటిగా ఉందని తేలింది. ఇంకా కొన్ని సీట్లు తేలాల్సి ఉంది. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టీడీపీ4, జనసేన 1 సీటు గెలుచుకుంది. అంటే ఇప్పుడు టీడీపీ కొంతవరకు పికప్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఈ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news