శ్రావణమాసం పోయింది.. బతుకమ్మతోపాటు.. దసరా కూడా వచ్చింది.. కానీ వాళ్లు ఆశలు మాత్రం నెరవేరలేదు.. కనీసం ఇస్తారా ఇవ్వరా అనే క్లారిటీ కూడా లేదు.. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో ఉండే సీనియర్ నేతలు డైలమాలో ఉన్నారు. మంత్రిపదవులకు పోటీ ఉండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోందన్న ప్రచారం నడుస్తున్న వేళ.. దీపావళి తర్వాతే విస్తరణ ఉంటుందన్న టాక్ పార్టీలో వినిపిస్తోంది.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాబోతుంది.. మంత్రివర్గ విస్తరణ శ్రావణమాసంలోపు ఉంటుందని తొలుతా కాంగ్రెస్ నేతలు భావించారు.. అప్పటి నుంచి ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.. తెలంగాణ రాష్ట పండుగ బతుకమ్మ వచ్చింది.. వెనువెంటనే దసరా కూడా వచ్చింది.. కానీ విస్తరణ జరగలేదు.. నేతల ప్రయత్నాలు కూడా ఆగలేదు.. విస్తరణ జరిగితే తమకు పదవి గ్యారేంటీ అనే నేతలంతరూ ఇప్పుడు ఎన్నాళ్లీ ఎదురుచూపులంటూ తెగ ఫీలవుతున్నారట..
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకివెళ్లిన ప్రతిసారి లేదా.. ఢిల్లీ నుంచి పిలుపొచ్చినప్పుడు నేతల ఆశలు చిగురిస్తున్నాయి.. విస్తరణ అంశం ప్రస్తావనకు రాలేదని తెలుసుకుని.. సైలెంట్ అయిపోతున్నారు..దసరా పండుగలోపు విస్తరణ ఉంటుందని భావించిన నేతలకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది.. ఇప్పుడల్లా విస్తరణ లేదని అధిష్టానం సంకేతాలిచ్చిందట.. దీంతో నేతలు సప్పమంటూ చల్లబడిపోయారు..
మంత్రివర్గ విస్తరణపై చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు గంపెడాశలు పెట్టుకున్నారు. మంత్రి పదవి దక్కడం ఖాయమని తమ అనుచరులతో వారు ధీమాగా చెబుతున్నారు..సీఎం రేవంత్ రెడ్డి డిల్లీకి వెళ్తే చాలు.. టూర్ అప్డేట్ తెలుసుకుంటున్నారు.. విస్తరణపై ఏం చర్చ జరిగిందనే దానిపై ఆరాలు తీస్తున్నారట.. మంత్రవర్గ విస్తరణ లేట్ అవుతున్నా.. ఎమ్మెల్యేలు మాత్రం తమ ప్రయత్నాలు ఆపడం లేదు..
సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూనే.. ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు.. తమకు అవకాశం కల్పించమని రిక్వెస్టు చేస్తున్నారట..భారీగా ఆశావాహులు ఉండటంతో అధిష్టానం ఆలోచనలో పడిందట.. అందుకే వాయిదాలు వేస్తోందని పార్టీలో చర్చ జరుగుతోంది.. హర్యానా ఓటమితో నిరాశలో ఉన్న ఏఐసీసీ పెద్దలు.. దీపావళి తర్వాత విస్తరణ గురించి ఆలోచిస్తామని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారట.. దీంతో నేతలు మళ్లీ యాక్టివ్ అయి.. లాబీయింగులు మొదలు పెట్టినట్లు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.. దీపావళి తర్వాతైనా విస్తరణ ఉంటుందో లేదో చూడాలి..