మరో తొమ్మిది నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. తాజాగా నాలుగో లిస్ట్ ప్రకటించారు ఆయన.ఈ నాలుగో లిస్టులో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్ సభ స్థానంలో ఇంఛార్జిలను మార్చారు. మొత్తం 9 చోట్ల ఇంఛార్జులను నియమించినట్లుగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకి స్పష్టం చేశారు.
అయితే ఈసారి ఇచ్చిన లిస్టులో అన్నీ ఎస్సీ నియోజకవర్గాలు ఉండటం గమనార్హం. ఒక్క కనిగిరి మినహాయిస్తే మిగతా నియోజకవర్గాలు అన్నీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కి చెందినవే. చిత్తూరు ఎంపీ స్థానానికి మంత్రి కె నారాయణ స్వామిని ఇంచార్జ్ గా నియమించారు.ప్రస్తుతం ఆయన గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్పను గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ని చేశారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ని తప్పించి ఆ స్థానంలో వీరాంజనేయులు ని ఇంచార్జ్ గా ప్రకటించారు. ఇటీవల జొన్నలగడ్డ పద్మావతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను తొగించినట్లు సమాచారం.
ఇక మరో ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆథర్ ను కూడా తొలగించారు. ఆయన స్థానంలోడాక్టర్ సుధీర్ దారాకు అవకాశము కల్పించారు.తిరువూరు కి నల్లగట్ల స్వామిదాస్ ని నియమించారు.ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు.గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కొక్కిలిగడ్డ రక్షణ నిధిని కూడా తప్పించారు.మడకశిర కు ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామిని తప్పించి ఇంచార్జ్ బాధ్యతలను ఈర లక్కప్పకు అప్పగించారు. కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న తానేటి వనితను గోపాలపురంకు షిఫ్ట్ చేశారు. ఆమె స్థానoలో తలారి వెంకట్రావు కి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు.ఇక కనిగిరి కి దద్దాల నారాయణ యాదవ్ ను ఇంచార్జ్ గా చేశారు. ఇక్కడ యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆయన్ను ఇంచార్జ్ గా చేశారు. మొత్తానికి నాలుగో లిస్ట్ కూడా బయటికి వచ్చేసింది.ఇక 5వ లిస్ట్ ఎప్పుడిస్తారా అని వైసీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.